చిరు స్టైల్‌ తో వ‌రుణ్‌

Update: 2015-11-08 15:30 GMT
మెగా హీరో వ‌రుణ్‌ తేజ్ న‌టించిన లోఫ‌ర్ సినిమా లుక్కు అలా బ‌య‌టికొచ్చిందో లేదో అప్పుడే పోలిక‌లు వెద‌కడం మొద‌లెట్టారు నెటిజ‌న్లు. చివ‌రికి వ‌రుణ్ త‌న పెదనాన్న చిరంజీవి స్టైల్‌ తో క‌నిపిస్తున్నాడ‌ని తేల్చారు. అందుకు సంబంధించి కొన్ని స్టిల్స్‌ ని కూడా పోస్ట్ చేస్తూ హ‌డావుడి చేస్తున్నారు. మ‌రి చిరులాగే చూపించాల‌ని పూరి అనుకొన్నాడో లేక యాథృచ్ఛికంగా జ‌రిగిందో ఏమో కానీ... ఇక్క‌డున్న ఫొటోలో మాత్రం వ‌రుణ్ అచ్చం చిరులాగే పోజు పెట్టాడు.

ఇప్ప‌టిదాకా వ‌రుణ్ చేసిన రెండు సినిమాలు కూడా క్లాస్ యాంగిల్‌ నే చూపించాయి. క్లాస్‌ గా క‌నిపించ‌డంలో వ‌రుణ్‌ తేజ్‌ కి తిరుగులేదన్న పేరొచ్చింది. మెగా కుటుంబం నుంచి వ‌చ్చాడు కాబ‌ట్టి వ‌రుణ్ మాస్ లుక్కులోనూ ఒదిగిపోవ‌ల్సిందే, మాస్ హీరో అనిపించుకోవ‌ల్సిందే. మ‌రి ఆ ముచ్చ‌ట ఎప్పుడు తీరుతుందా అని మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంత‌లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లోఫ‌ర్ విడుద‌లవుతోంది.  పూరి సినిమా అంటే మాస్ జ‌నాల‌కు పండ‌గే. పైగా లోఫ‌ర్ అనే మాస్ పేరుతో సినిమా తీశాడు. సో... వ‌రుణ్ మ మ మాస్ అంటూ తెర‌పై సంద‌డి చేయ‌డం ఖాయం అని తేలిపోయింది. ఫ‌స్ట్‌ లుక్‌ లోనూ మాస్ అంశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. రొమాన్స్‌ కి రొమాన్స్‌ - సెంటిమెంట్‌ కి సెంటిమెంట్‌ - ఫైట్ల‌కు ఫైట్లు అన్న‌ట్టుగా అన్నీ మిక్స్ చేసి తీసిన‌ట్టున్నాడు పూరి. ఆయ‌న విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్ల‌లోనూ ఆ మూడు విష‌యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. 
Tags:    

Similar News