ఐతే పూరిని చూసి భయపడుతున్నారన్నమాట

Update: 2015-12-05 17:30 GMT
పూరి జగన్నాథ్ పడుతుంటాడు, లేస్తుంటాడు. మిగతా డైరెక్టర్ల లాగా ఆచితూచి సినిమాలు చేయడం అతడికి అలవాటు లేదు. ఆ సమయానికి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతో సినిమాలు చేసేస్తుంటాడు. వారం రోజుల్లో స్క్రిప్టు రాసి.. రెండు మూడు నెలల్లో సినిమా తీసి అవతల పారేస్తుంటాడు. అందుకే క్వాలిటీలో కొన్నిసార్లు తేడా వస్తుంటుంది. అయినప్పటికీ పూరి క్రేజ్ మాత్రం కొట్టిపారేయలేనిది. కేవలం తన పేరు చూసి ప్రేక్షకులు సినిమాకు వచ్చేలా చేసుకున్న అతి కొద్ది మంది డైరెక్టర్లలో అతనొకడు. అందుకే పూరి సినిమాలకు ట్రేడ్ లో ఉండే డిమాండే వేరు. పూరి కొత్త సినిమా ‘లోఫర్’కు బిజినెస్ కూడా ఓ రేంజిలో జరగడానికి అదే కారణం.

ఈ నెల 18న ‘లోఫర్’ ప్రేక్షకుల ముందుకొస్తుండగా.. తెలుగులో ఆ రోజు పోటీకి దిగడానికి మరే సినిమా కూడా ముందుకు రావట్లేదు. అలాగని సినిమాలు లేవనుకుంటే పొరబాటే. రిలీజ్ కోసం చాలా సినిమాలు వరుసలో ఉన్నాయి. 25న మామ మంచు అల్లుడు కంచు - సౌఖ్యం సినిమాలు షెడ్యూలై ఉన్నాయి. సుధీర్ బాబు సినిమా ‘భలే మంచి రోజు’ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. కానీ‘లోఫర్’కు పోటీగా వెళ్లడానికి సాహసించలేక ఆ సినిమాను కూడా 25కే వాయిదా వేశారు. ఇంకొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ‘లోఫర్’కు పోటీగా దింపేందుకు సాహసించడం లేదు. వరుణ్ కు ఇంకా స్టార్ ఇమేజ్ రాలేదు కాబట్టి..‘లోఫర్’కున్న క్రేజ్ లో మెజారిటీ వాటా పూరిదే అన్నమాట.
Tags:    

Similar News