మళ్లీ హౌస్ కామెడీకే ఫిక్స్ అయిన వైట్ల!!

Update: 2016-06-14 10:58 GMT
శ్రీను వైట్ల సినిమాలంటే ఒక టైపులో ఉంటాయి అనే విషయం ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. ఢీ చిత్రం నుంచి ఒకటే ఫార్మాట్ ను పట్టుకుని సినిమాలు తీసేస్తున్నాడు వైట్ల. నమో వెంకటేశ - దూకుడు - ఆగడు - బ్రూస్ లీ.. ఇలా సినిమా ఏదైనా, హీరో ఎవరైనా.. ఈ డైరెక్టర్ ఫాలో అయ్యే ట్రెండ్ ఒకటే. ఇప్పుడు మిస్టర్ కోసం కూడా ఇదే స్కెచ్ వేశారని తెలుస్తోంది.

మిస్టర్ మూవీ షూటింగ్ ప్రారంభానికి ఆలస్యం జరగడంతో అనేక రూమర్స్ వచ్చాయి. ప్రాజెక్ట్ మీదే అనుమానాలు తలెత్తాయి. అయితే.. అసలు ఈ లేట్ కి కారణం ఏంటో ఇప్పుడు తెలిసింది. మూవీ షూట్ కోసం స్పెయిన్ లోని ఓ విభిన్నమైన హౌజ్ ని సెలక్ట్ చేశారు. ఇక్కడే సినిమాలోని మేజర్ పోర్షన్ షూట్ చేస్తారట. ఇన్నాళ్లూ ఈ హౌజ్ ఖాళీ అవకపోవడంతోనే.. షూటింగ్ మొదలుపెట్టలేకపోయారని తెలుస్తోంది. ఇప్పుడా హౌజ్ ఖాళీ అవడంతో.. ఇప్పటికే ఆక్యుపై చేసేశారట. తమ వర్క్ కంప్లీట్ అయ్యేవరకు కంట్రోల్ లో ఉండేలా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.

లావణ్య త్రిపాఠి- హేభా పటేల్ లు హీరోయిన్లుగా నటిస్తన్న మిస్టర్ చిత్రానికి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం స్పెయిన్ లోని సూపర్బ్ లొకేషన్స్ ను సెలక్ట్ చేశారు. పక్కా ప్లానింగ్ తో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల శరవేగంగా షూటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది చివరి కల్లా మిస్టర్ ను రిలీజ్ చేయాలన్నది శ్రీను వైట్ల ఐడియా.
Tags:    

Similar News