వరుణ్‌ ఖాతాలో మరో షార్ట్ ఫిలిం డైరక్టర్

Update: 2017-12-15 11:04 GMT
కెరీర్ లో మొదటి సక్సెస్ కోసం చాలా కష్టపడ్డ మెగా హీరో వరుణ్ తేజ్ ఎట్టకేలకు ఫిదా తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని తదుపరి కథలను వెంట వెంటనే ఒకే చేస్తున్నాడు. సాధారణంగా ఒక హీరో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటే నెక్స్ట్ సినిమా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని అనుకుంటాడు. ముఖ్యంగా మాస్ తారహ స్టైల్ లో ప్రయత్నాలు చేస్తుంటారు. అదే విధంగా పెద్ద దర్శకులతో పనిచెయ్యాలని కూడా అనుకుంటారు.

కానీ వరుణ్ తేజ్ మాత్రం సింపుల్ స్టోరీలను ఎంచుకుంటూ నవతరం దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. కథలో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా వెంటనే ఒకే చేస్తున్నాడట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలిప్రేమ అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు కూడా ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసినోడే. అయితే ఇప్పుడు అదే తరహాలో ఇండియన్.. ఏజ్ 25 వంటి షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన శశి కుమార్ అనే మరో యువ షార్ట్ ఫిల్మ్ దర్శకుడికి వరుణ్ తేజ్ అవకాశం ఇచ్చాడు.

కథ చాలా కొత్తగా అనిపించి వెంటనే ఒకే చేశాడట. సీనియర్ దర్శకులకన్నా మొదటి సినిమాను కసిగా తీయాలనే కసితో ఉండే యువ దర్శకులనే వరుణ్ నమ్ముతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే వర్క్ చేశాడు. ఎవరైనా దర్శకుడు మొదటి సక్సెస్ అందుకుంటే చాలు ఆ వెంటనే పవన్ నుంచి అఫర్ వచ్చేది. అయితే వరుణ్ మాత్రం కొంచెం అడ్వాన్స్ గా షార్ట్ ఫిల్మ్ తో సక్సెస్ కొడితే తనే వెండితెర అఫర్ ఇచ్చేస్తున్నాడు. దిల్ రాజు ఈ ప్రాజెక్టును తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరుణ్ రీసెంట్ గా ఘాజి దర్శకుడితో కూడా ఒక సినిమాను ఒకే చేశాడు.   
Tags:    

Similar News