స్పేస్ నేపథ్యంలో సినిమా అంటే గ్రావిటీ - స్పేస్ ఒడిస్సీ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇటీవలే రిలీజైన `టిక్ టిక్ టిక్` చిత్రం వెంటనే స్ఫురణకు వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేని చోట మనిషి గమనం - ప్రయోగాలపై సినిమాలు ఎంతో ఆసక్తి పెంచేవే. ఉద్వేగాల్ని పీక్స్‌లో చూపించేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఇలాంటి టిపికల్ కాన్సెప్టును ఎంచుకున్నాడు సంకల్ప్ రెడ్డి. తొలి ప్రయత్నమే జలాంతర్గామి నేపథ్యంలో `ఘాజి` సినిమా తీసి మెప్పించాడు. ఈసారి అంతరిక్షం బ్యాక్ డ్రాప్ సినిమాతోనూ మెప్పిస్తాడనే అంచనా వేస్తున్నారు.
వరుణ్ తేజ్ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న `అంతరిక్షం 9000కెఎంపిహెచ్` ఈ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంగా అందరిలో ఒకటే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని ఏ తరహా కథాంశంతో తెరకెక్కిస్తున్నారు? అన్నది తెలుసుకోవాలన్న తపన అభిమానుల్లో ఉంది. సౌత్ లో వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు రిలీజవుతున్నాయి. 2.ఓ తర్వాత జోనర్ పరంగా మళ్లీ అంత పెద్ద ప్రయోగమే ఇది. అందుకే `అంతరిక్షం` సినిమా కథేంటి? అన్న ఆరాలు మొదలయ్యాయి.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుందట. ఉద్యోగం కోల్పోయిన ఓ యువ స్పేస్ సైంటిస్ట్ అత్యవసర సన్నివేశంలో భారతదేశాన్ని కాపాడేందుకు తిరిగి విధులకు హాజరవుతాడు. ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ ఏంటి? అసలు ఇండియాకి ఎలాంటి ప్రమాదం ఎదురైంది? అన్నది తెరపైనే చూడాలని చెబుతున్నారు. అతిదీరావ్ హైదరీ - లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. కాస్త రొమాన్స్ కి - ప్రేమకథకు స్కోప్ ఉందని చెబుతున్నారు. ఓవైపు స్పేస్ లో ఉత్కంఠ కలిగించే సీరియస్ డ్రామా నడిపిస్తూనే - మరోవైపు ప్రేమకథను నడిపించే ఆస్కారం ఉందని తెలుస్తోంది.