మెగా హీరోకు మిగిలేది జీరోనే

Update: 2019-01-05 01:30 GMT
సంక్రాంతి వేడి మెల్లగా రాజుకుంటోంది. దేని ప్రత్యేకత దానికి ఏ హీరోకా అభిమానులు అండగా ఉండటంతో ఓపెనింగ్స్ విషయంలో అందరూ ధీమాగానే ఉన్నారు. అయితే మాస్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసిన ఎఫ్2నే కాస్త లో ప్రొఫైల్ లో వస్తోంది. ఇందులో మెగా హీరో వరుణ్ తేజ్ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఫోకస్ పూర్తిగా వినయ విధేయ రామ మీదే ఉంది. అది మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనక వాళ్ళు ఎఫ్2ని కనీసం పరిగణనలోకి తీసుకోవడం కూడా కష్టమే. అయితే ఎఫ్2 హిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే వరుణ్ తేజ్ కు దీని వల్ల ఒరిగే ప్రయోజనం మాత్రం పెద్దగా ఉండే అవకాశం లేదు.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అయిన ఎఫ్2లో కామెడీ టైమింగ్ తో కంటెంట్ మొత్తాన్ని తన కంట్రోల్ లో తీసుకునే వెంకటేష్ ఉండగా పది సినిమాల అనుభవం కూడా లేని వరుణ్ తేజ్ నిలవడం అంత ఈజీ కాదు. పైగా ఒక పక్క మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ క్యూటీ మెహ్రీన్ అందాలు మరోపక్కా అనిల్ రావిపూడి జోడించే మసాలాలు వీటి మధ్య వరుణ్ తన ఉనికిని చాటుకోవడం సవాలే. ఒకవేళ ఎఫ్2 హిట్టు కొట్టినా దాని క్రెడిట్ లో అధిక శాతం వెంకటేష్ ఆ తర్వాత అనిల్ రావిపూడి లాగేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలన్స్ ఏదైనా ఉంటే దిల్ రాజు ఖాతాలో వెళ్ళిపోతుంది.

వరుణ్ కు అంత గుర్తింపు రావాలి అంటే ఆన్ స్క్రీన్ తన డామినేషన్ చూపించాలి. అయితే కథ పరంగా వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ఉండగా అది జరగని పనే. ఇప్పటికే అంతరిక్షం దెబ్బతో కుదేలైన వరుణ్ కి ఎఫ్2 హిట్ అయినా చాలు కొంత ఊరట దక్కుతుంది. ఫిదా-తొలిప్రేమలు ఇచ్చిన సక్సెస్ కిక్ ని కొనసాగించాలనే తాపత్రయంలో ఉన్న వరుణ్ కి మరో స్పీడ్ బ్రేకర్ పడితే ఇబ్బందే.


Full View

Tags:    

Similar News