‘మిస్టర్’ సినిమా మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. శ్రీను వైట్ల లాంటి పెద్ద దర్శకుడితో పని చేస్తున్నాడు కాబట్టి కెరీర్ మరో స్థాయికి వెళ్తుంది అనుకుంటే.. ఉన్న స్థాయి నుంచి కింద పడ్డాడు. అంతకుముందు వరుణ్ చేసిన ఏ సినిమాకూ రానన్ని విమర్శలు దీనికి వచ్చాయి. వరుణ్ తేజ్ సినిమాల ఎంపిక మీద కూడా సందేహాలు రేకెత్తాయి. ఐతే ‘మిస్టర్’ విషయంలో తప్పు జరిగిన మాట వాస్తవమని వరుణ్ అంగీకరించాడు. ఇకపై తనకు నప్పని పాత్రలు ఎంచుకోనని అతను స్పష్టం చేశాడు. తాను ఇప్పుడు సరైన బాటలోనే సాగుతున్నానని ‘ఫిదా’ రుజువు చేస్తుందని.. ఈ సినిమా మళ్లీ తనను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘‘ఫిదా నా కెరీర్ కు చాలా ముఖ్యమైన సినిమా. ఇంతకుముందు నేను చేసిన ‘మిస్టర్’ సినిమాతో నేనే కాదు.. మెగా అభిమానులు కూడా చాలా నిరుత్సాహపడ్డారు. ‘మిస్టర్’ సినిమాను ఒక్క రోజులో ఒప్పుకోలేదు. ఒక టీంగా ఆ సినిమా విషయంలో మేం చాలా చోట్ల విఫలమయ్యాం. మా అభిమానులు ఆ సినిమా చూసి చాలా హర్టయ్యారు. అందుకే ఇకపై నాకు తగ్గ సినిమాలే చేస్తానని మాట ఇస్తున్నా. ‘ఫిదా’ విషయంలో అన్నీ బాగా కుదిరాయి. సినిమా కూడా బాగా వచ్చింది. శేఖర్ కమ్ముల గారు ఈ కథ చెప్పగానే బాగా కనెక్టయిపోయాను. మామూలుగా నా కథలన్నీ నాన్నగారు వినేవారు. కానీ ఈ సినిమా దిల్ రాజు గారిది కాబట్టి ఆయన కథ కూడా వినలేదు. నేరుగా ప్రివ్యూ చూశారు. చాలా బాగుందని చెప్పారు. పెదనాన్న కూడా ఈ సినిమా చూస్తారు’’ అని వరుణ్ తెలిపాడు.