తేడా వస్తే పగిలిపోద్దని తెలుసు

Update: 2018-01-22 04:17 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తొలిప్రేమ మూవీ ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ చేసిన లవ్ స్టోరీల్లో అభిమానులు ఎప్పటికే గుర్తుంచుకునే ప్రేమకావ్యం లాంటిది ఆ సినిమా. ఆ సినిమా టైటిల్ పెట్టుకున్నందుకు ఆ రేంజి ఏమాత్రం తగ్గకుండా అభిమానులందరినీ మెప్పించాలనే సినిమా తీశామంటున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. తాజాగా జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాకు ఈ టైటిలే ఎందుకు పెట్టామో.. ఎంత ఆలోచించి పెట్టామో బయటపెట్టాడు.

‘‘ఈ సినిమా షూటింగ్ ఆరేడు నెలలు జరిగింది. మొదట్లో టైటిల్ ఏదీ ఫిక్స్ చేసుకోలేదు. చాలా టైటిళ్లు అనుకున్నాక తొలి ప్రేమ అని పెడదామన్న మాట వచ్చింది. ఈ టైటిల్ నాకు నచ్చినా చాలా భయమేసింది. అదేమాట డైరెక్టర్ వెంకీకి చెప్పాను.  ఆ టైటిల్ పెట్టుకుని ఏమన్నా తేడా వస్తే పగిలిపోద్ది మనకి అని. బాబాయ్ పవన్ కు అది ఐకనిక్ ఫిలిం. ఆ సినిమాను అభిమానులంతా ఎంత ఆదరించారో మాకు బాగా తెలుసు. అందుకే ఆ టైటిల్ ను పాడు చేయకుండా జస్టిఫై చేసేలాగానే సినిమా చేశాం. చూశాకే ఈ టైటిల్ కరెక్టని అందరూ అంటారు’’ అని ఈ మూవీ టైటిల్ వెనుక స్టోరీని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

‘‘నా ఫస్ట్ సినిమా నుంచి ప్రతిసారి హీరోయిన్ ను వెతకడం పెద్ద టాస్క్. హైట్ సరిపోకపోవడమే సమస్య. మొదటిసారి తల దించుకోకుండా స్ట్రయిట్ గా చూడగలిగే హీరోయిన్ రాశి ఖన్నా. తన తొలి సినిమా ఊహలు గుసగుసలాడే తరవాత మళ్లీ గుర్తుండిపోయే ప్రేమకథ చేసింది’’ అంటూ తన మాటలతో నవ్వులు పూయించాడు వరుణ్ తేజ్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్. ప్రొడ్యూస్ చేసిన తొలిప్రేమ సినిమాతో కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
Tags:    

Similar News