సహజంగా మాస్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అందుకే ప్రతి హీరో మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. మెగా ఫ్యామిలీ హీరోలు మాస్ అనే పదానికి కేరాఫ్ అడ్రెస్. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం ఆ రూటుకు భిన్నంగా మెగా ఫ్యామిలీలో క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో ఒకటి అరా సినిమాలు ట్రై చేసినా ఫుల్ మాస్ సినిమా అయితే ఇంతవరకూ చేయలేదు. 'వాల్మీకి' తో మొదటి సారి మాస్ సినిమాల రుచి తెలిసిందని నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎగ్జైట్ అవుతూ చెప్పాడు.
వరుణ్ మాట్లాడుతూ "ఇది నా 9 వ సినిమా. ఇప్పటివరకూ ఎక్స్ పరిమెంట్స్ అంటూ.. క్లాస్ సినిమాలంటూ.. లవ్ స్టోరీలంటూ ఏదో ఒకటి చేశాను. ఫస్ట్ టైం ఒక మాస్ సినిమా చేస్తే 'ఆ కిక్కే వేరప్పా. మామూలుగా లేదమ్మ'(ఈ డైలాగును పవన్ కళ్యాణ్ స్టైల్ లో చెప్పాడు). 'రేయ్ మేము మాస్ ఎందుకు చేస్తామో నీకు అర్థం కావడం లేదు.. మాస్ లో ఒక స్పెషల్ ఉంటుంది' అని చిరంజీవి గారు నాకు ఎప్పుడూ చెప్తుండేవారు. ఇప్పుడు ఫైనల్ గా ఆ రుచి కొంచెం చూశాను. డాడీ థ్యాంక్ యూ సో మచ్" అంటూ వాల్మీకి సినిమా తనకు స్పెషల్ అన్నట్టుగా చెప్పాడు.
కళ్యాణ్ బాబాయ్ తో 'గబ్బర్ సింగ్' లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ గారితో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే తో చేసిన శోభన్ భాబు - శ్రేదేవి ల 'వెల్లువొచ్చి గోదారమ్మ' పాట ను యానాం లో షూటింగ్ చేశామని.. అద్భుతంగా వచ్చిందని తెలిపాడు.