వరుణ్ విలన్ గా ఒప్పుకుంటాడా?

Update: 2018-11-19 08:17 GMT
కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ సక్సెస్ విషయంలో కాస్త ఇబ్బంది పడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు మాంచి జోష్ మీదున్నాడు. గత ఏడాది చేసిన ఫిదా ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలవగా ఈ సంవత్సరం తొలిప్రేమ తీయని జ్ఞాపకంగా మిగిలింది. ఇక సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అంతరిక్షంపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ మూవీ మీద బిజినెస్ ఆఫర్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. దాని తర్వాత సంక్రాంతి రేస్ లో వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్2 తో సరదా అల్లరి చేయబోతున్నాడు. ఈ రెండు సక్సెస్ అయితే కుర్రాడి రేంజ్ ఇంకా పెరుగుతుంది.

వీటి తర్వాత కొత్త సినిమా డీటెయిల్స్ చెప్పకుండా గోప్యత మైంటైన్ చేస్తున్న వరుణ్ తాజాగా ఒక నెగటివ్ రోల్ మీద మనసు పారేసుకున్నాడని ఇన్ సైడ్ టాక్. నాలుగేళ్ల క్రితం 2014లో తమిళ్ లో జిగర్ తండా అనే సినిమా వచ్చింది. సిద్దార్థ్ హీరోగా నటించగా బాబీ సింహా విలన్ గా చేసాడు. అది సెన్సషనల్ హిట్ అయ్యింది. హీరో కంటే విలన్ కే ఎక్కువ పేరు తెచ్చిన సినిమా అది. కన్నడలో అదే పేరుతో రీమేక్ చేస్తే విలన్ గా సాయి కుమార్ తమ్ముడు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి శంకర్ నటించి అంతే పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు ఇది తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాగా విలన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను వరుణ్ ఇమేజ్ కి తగ్గట్టు కొద్దిగా మార్చి స్క్రిప్ట్ రూపకల్పన జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. దిల్ రాజు దీని హక్కులను ఎప్పుడో తీసుకున్నారు. మరి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి. అన్నట్టు ఈ జిగర్ తండా తెలుగులో చిక్కడు దొరకడు పేరుతో డబ్ చేసారు కాని మనవాళ్ళు పట్టించుకోలేదు. ఆన్ లైన్ లో సైతం అందుబాటులో లేదు. శాటిలైట్ లో కూడా రాలేదు. సో మన ప్రేక్షకులకు అవగాహనా ఉండదు కాబట్టి ఇది మంచి ప్రయత్నమే కానీ సాఫ్ట్ రోల్స్ లో చూసేందుకు అలవాటు పడిపోయిన వరుణ్ తేజ్ దీనికి ఒప్పుకుంటాడా అనేదే అసలు ప్రశ్న
Tags:    

Similar News