జాతీయ అవార్డును దక్కించుకున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. కెరీర్ ఆరంభంలో కాస్త స్లో అండ్ స్టడీ అన్నట్లుగా ముందుకు సాగినా కూడా ఇప్పుడు మాత్రం ఆయన చాలా స్పీడ్ గా సినిమాలను చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నాగార్జునతో ఘోస్ట్ సినిమాను చేస్తున్న విషయం అందరికి తెల్సిందే.
ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తో ఈనెల చివరి వరకు సినిమా షూటింగ్ ముగుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఘోస్ట్ సినిమా విడుదల కాకుండానే తదుపరి సినిమాను మొదలు పెట్టబోతున్నాడట. ఇప్పటికే వరుణ్ తేజ్ తో సినిమాను చేయబోతున్నట్లుగా ప్రవీణ్ సత్తార్ నుండి ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన డేట్ ఫిక్స్ అయ్యింది.
ప్రస్తుతం ఎఫ్ 3 బిజీలో ఉన్న వరుణ్ తేజ్ ఆ వెంటనే ప్రవీణ్ సత్తారు సినిమాలో నటించేందుకు గాను సిద్దం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల రెండవ లేదా మూడవ వారంలోనే వీరి కాంబోలో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత ఘోస్ట్ సినిమా విడుదల ఉంటుందని ప్రవీణ్ సత్తార్ సన్నిహితుల నుండి మీడియాకు సమాచారం అందుతోంది.
గని సినిమా తో వరుణ్ తేజ్ నిరాశ పర్చాడు. అయితే ఎఫ్ 3 తో ఖచ్చితంగా సక్సెస్ ను దక్కించుకుంటాడనే నమ్మకం ఉంది. ఆ సినిమా తర్వాత మరో సినిమాకు ఏమాత్రం గ్యాప్ తీసుకోవద్దు అనే ఉద్దేశ్యంతోనే ప్రవీణ్ సత్తార్ కు వచ్చే నెల నుండే డేట్లు ఇవ్వడం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందట.
వరుణ్ తేజ్ మొదటి పాన్ ఇండియా సినిమా అంటూ ప్రవీణ్ సత్తార్ మూవీకి అప్పుడే టాక్ వచ్చింది. పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్లుగానే సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్ లో ప్రారంభించి ఈ ఏడాది చివరి వరకు సినిమాను ముగించాలని భావిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా జూన్ మొదటి వారంలో ప్రకటన వచ్చే అవకాశం ఉందట.