మెగా డాటర్ నీహారిక సినీ ఎంట్రీ గురించే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాక్. మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు కొణెదల నీహారిక హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తున్నారు. దీనికి మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అని కొన్ని వేల టన్నుల బరువున్న ప్రశ్న అందరిలోనూ మెదిలింది. ఇదే సందేహాన్ని నీహారిక సోదరుడు, వరుణ్ తేజ్ ముందు ఉంచితే అట్నుంచి ఎలాంటి సమాధానం వినిపించిందో తెలుసా? ..
నీహారిక ముందుగా ఇంట్లో అందరితో ముచ్చటించింది. హీరోయిన్ అవుతానని అంది. దానికి అందరూ ముక్తకంఠంతో ఎస్ అన్నారు. నేను కూడా చెల్లాయికే సపోర్ట్... అని అన్నాడు. అయితే ఫ్యాన్స్ నుంచి మొదట వద్దని ఒత్తిడి వచ్చింది. వారందరికీ నచ్చ చెప్పామని అన్నారు వరుణ్ తేజ్. అసలు ఓ వ్యక్తి జీవితాన్ని శాసించే హక్కు ఫ్యాన్స్ కి ఉందా? అని అడిగితే... అభిమానులు మా కుటుంబంలో ఒక భాగం. వారి సమ్మతి లేకుండా ఏదీ చేయం. నచ్చ జెప్పుకుంటాం. నీహారిక వెండితెరపై కనిపించినా అభిమానుల్ని నిరాశపరచదు. పరిధుల్లోనే నటిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.
అంతే కాదు మేం అందరం ఒప్పుకునే కంటే ముందు పెదనాన్న నుంచి అనుమతి తీసుకుంది. హీరోయిన్ అవుతానని పెదనాన్నతో చెప్పింది నీహారిక. అక్కడ ఓ కే అన్న తర్వాత తను కూడా ఎస్ అనుకుంది.. అని వరుణ్ తేజ్ టాప్ సీక్రెట్ చెప్పాడు. అదీ మ్యాటరు.