మెగా హీరో వరుణ్ తేజ్ బాగానే స్పీడ్ చూపిస్తున్నాడు. ఫిదా మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ మాత్రమే కాదు.. మీడియం బడ్జెట్ చిత్రాలకు బెంచ్ మార్క్ సెట్ చేసేశాడు. 50 కోట్ల వసూళ్లను సాధించి ఇతర హీరోలకు భారీ టార్గెట్ నిర్దేశించాడు. తన తర్వాతి సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలిప్రేమ మూవీ చేస్తున్న వరుణ్ తేజ్.. మరోవైపు మల్టీస్టారర్ మూవీస్ విషయంలో కూడా జోరు చూపిస్తున్నాడు.
అనిల్ రావిపూడి రూపొందించనున్న ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మల్టీస్టారర్ లో వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ నటించనున్నాడనే టాక్ ఉంది. అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. దాదాపు ఈ కాంబో ఫైనల్ చేసేసినట్లే అంటున్నారు. మరోవైపు.. దగ్గుబాటి రానాతో కలిసి ఓ మల్టీ స్టారర్ చేసేందుకు కూడా వరుణ్ తేజ్ సిద్ధమవుతున్నాడట. కోలీవుడ్ దర్శకుడు సాల్మన్ రాజ్ తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కించే అవకాశం ఉండగా.. రానాతో కలిసి నటించే మూవీపై మాంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడట వరుణ్ తేజ్.
మెగా హీరో ట్యాగ్ ఉన్నా.. ఇతర హీరోలతో కలిసి నటించేందుకు అంగీకరించడమే కాకుండా.. పాత్ర విషయంలో బ్యాలెన్స్ చూసుకోకుండా.. వరుణ్ తేజ్ ప్రాజెక్టుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆరంభం నుంచి ఇదే తరహా ఆలోచనలతో సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ కు.. ఈ ట్రెండ్ బాగానే కలిసొచ్చిందని చెప్పాలి.