వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ ఈనెల 17న రిలీజవుతోంది. ఈ సందర్భంగా నిన్నటిరోజున వరుణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ ని టచ్ చేశాడు. వీటిలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. వాటికి మెగా కుర్రోడు తెలివైన సమాధానాలే ఇచ్చాడు మరి. అవేంటో చూద్దామా?
'లోఫర్' ఆడియోలో పవన్ ఫ్యాన్స్ అరిచి గోల చేశారు కదా.. దానికి పూరి సీరియస్ గానే స్పందించి 'వీళ్లను క్రమశిక్షణలో పెట్టాలి' అని పవన్ కి సూచించారు. మీరు ఫేస్ బుక్ లో పెట్టిన సెల్ఫీకి కొందరు లైక్స్ కొట్టారు, మరికొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు కదా? అని అడిగితే.. నేను ఫేస్ బుక్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేసేశా. మీరు అంటుంటేనే తెలుస్తోంది. అయినా కామెంట్ చేసే హక్కు అభిమానులకు ఉంది. బాబాయ్ బయట ఎక్కడా కనిపించరు కాబట్టి అభిమానులు అలా అరుస్తుంటారు. ఆడియోలో ఎమోషన్ అయ్యారంతే. ప్రభాస్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
‘లోఫర్’ ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడుతుందేమో? అన్న సందేహం వ్యక్తం చేస్తే.. ప్రేక్షకులెవరైనా సినిమా లవర్స్. సినిమాలు చూడడం మొదలయ్యాక.. నచ్చిన హీరోకి ఫ్యాన్స్ అయిపోతారు. ఎవరి ఫ్యాన్ అయినా వేరే హీరోల సినిమాల్ని చూస్తారు. ఎవరికైనా సినిమా ముఖ్యం. చూడకుండా ఉండరు. కథ బావుంటే ఏ సినిమాని అయినా ఆదరిస్తారు. విజయం దక్కుతుంది.. అన్నాడు. లెటజ్ సీ.