అందరినీ బ్లేమ్ చెయ్యకండి -వరుణ్‌ తేజ్

Update: 2017-07-20 04:25 GMT
తెలుగు సినిమా ఎన్నడూ లేనంత విమర్శలుకు దూషణకు గురి అవుతుంది. డ్రగ్స్ పై కొంత మంది సినిమా ప్రముఖులు ఉండటంతో మొత్తం మీడియా దృష్టి అంతా ఇప్పుడు సినిమా ఇండస్ట్రి పైనే ఉంది. సినిమా వాళ్ళ పై ఏ చిన్న సంఘటన అయన చాల మందికి విందు బోజనమే అని చెప్పాలి. ప్రస్తుతం ఫిదా పబ్లిసిటీలో ఫుల్ బిజీగా ఉన్న మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కి.. ప్రస్తుతం టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్ స్కాండల్ పై కూడా స్పందించాల్సి వచ్చింది.

ప్రతీ పరిశ్రమలోనూ చెడు ఉంటుందన్న నాగబాబు తనయుడు.. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావడంతోనే ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతున్నారని చెప్పాడు. 'నిజానికి ఏం జరుగుతోందనే అంశంపై నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ చాలామంది ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇది సరైన విషయం కాదు. ఇక్కడే కాదు.. ఏ పరిశ్రమలో అయినా మంచి చెడూ రెండూ ఉంటాయి. పలువురుకి నోటీసులు వచ్చిన మాట నిజమే అయినా.. ఇంకా ఏదీ నిరూపణ కాలేదు. ఏం జరగనుందో తెలియాలంటే ఇంకా సమయం పడుతుంది. నేను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు అలా చేసి యూత్ కి తప్పుడు సందేశం ఇవ్వదలుచుకోలేదు. నా వరకు నేను అయితే డ్రగ్స్ కి బిగ్ నో చెబుతాను' అన్నాడు వరుణ్ తేజ్.

'ఇంటర్నెట్ ఇంత విస్తృతం అయిన ఇవాల్టి రోజుల్లో సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. జస్ట్ ఓ పేరు సెర్చ్ చేస్తే చాలు.. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తోంది. ఒక చెడు ఉదాహరణగా మిగిలిపోకూడదంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రతీ చోటా చెడు ఉన్నా.. సినిమా పరిశ్రమ కావడంతో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది' అన్నాడు వరుణ్ తేజ్.
Tags:    

Similar News