ఇప్పుడైనా ప‌వ‌న్ డైరెక్ట‌ర్ కి వ‌రుణ్ తేజ్ ఛాన్సిస్తాడా?

Update: 2022-03-04 07:32 GMT
సాగ‌ర్ చంద్ర‌...తాజా సంచ‌ల‌నం `భీమ్లానాయ‌క్‌`  బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఈ పేరు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం మారుమోగిపోతోంది. ఏ హీరోని, నిర్మాత‌ని క‌దిలించినా ఇదే పేరు. డా. రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన `అయ్యారే` సినిమాతో సాగ‌ర్ కె. చంద్ర సినీ జర్నీ డైరెక్ట‌ర్‌గా మొద‌లైంది. ఆ త‌రువాత చేసిన ఫిక్ష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు`తో సాగ‌ఱ్ చంద్ర‌కు మ‌రింత పేరొచ్చింది. ఓ బ‌యోపిక్‌ని మ‌లిచిన‌ట్టుగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. అదే వ‌రుష్ తేజ్ తో సినిమా చేసే అవ‌కాశాన్ని అందించింది.

ముందు పీవీపీ సంస్థ నుంచి సాగ‌ర్ చంద్ర‌కు పిలుపొచ్చింది. వ‌రుణ్ తేజ్ హీరో.. అయితే కొన్ని రోజులు స్క్రిప్ట్ వ‌ర్క్ చేశాక అది ముందుకెళ్ల‌లేదు. అదే ప్రాజెక్ట్ 14 రీల్స్ చేతికి చేరింది. అక్క‌డా వ‌రుణ్ తేజే హీరో కానీ ముందుకు క‌ద‌ల‌లేదు. కార‌ణం పిరియాడిక్ స్టోరీ, హీరో మార్కెట్ ని మించి భారీ బ‌డ్జెట్ దీంతో రిక‌వ‌రీ క‌ష్ట‌మ‌ని ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఆపేశారు. దీంతో సాగ‌ర్ చంద్ర ఏం చేయాలా అని ఆలోచిస్తున్న స‌మ‌యంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నుంచి `భీమ్లానాయ‌క్` ఆఫ‌ర్ రావ‌డంతో త‌ను ఈ ప్రాజెక్ట్ కోసం వ‌చ్చేయ‌డం, అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే.

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలి సారి క‌లిసి న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ మూవీ ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల‌లో పూన‌కాల‌తో ఊగిపోతున్నారు. ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది.ఈ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇద్ద‌రు స్టార్ ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న సాగ‌ర్ చంద్ర‌తో ఆగిపోయింద‌నుకున్న త‌న ప్రాజెక్ట్ ని వ‌రుణ్ తేజ్ మ‌ళ్లీ తిరిగి ప్రారంభిస్తాడా? అని చ‌ర్చించుకుంటున్నారు.

సాగ‌ర్ చంద్ర చెప్పింది పీరియాడిక్ ల‌వ్ స్టోరీ కాబ‌ట్టి, ప్ర‌స్తుతం తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది కాబ‌ట్టి వ‌రుణ్ తేజ్‌ ప‌క్క‌న పెట్టిన ప్రాజెక్ట్ ని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిస్తాడా? అని మాట్లాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ `గ‌ని` చిత్రంలో న‌టిస్తున్నాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీని త‌రువాత మే 27న సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి న‌టించిన `ఎఫ్ 3` థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ రెండు చిత్రాల‌పై వ‌రుణ్ తేజ్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు.

Tags:    

Similar News