చిరు - ప‌వ‌న్ నా వెన‌కే - వ‌రుణ్‌

Update: 2018-12-18 16:23 GMT
మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అంత‌రిక్షం 9000కెఎంపిహెచ్‌` ఈ నెల 21న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నేటి సాయంత్రం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిధిగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ వేడుక‌లో వ‌రుణ్ తేజ్ త‌న అన్న‌మీద ప్రేమాభిమానాల్ని ఓ రేంజులో కురిపించ‌డం మెగాభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. ``చిట్టిబాబు.. చిట్టి అన్న‌య్య వ‌చ్చాడు. .. థాంక్యూ చ‌ర‌ణ్ అన్నా.. !`` అంటూ వ‌రుణ్ అభిమానంగా పిలుచుకున్నాడు. ఇక ఈ వేదిక‌పై ఆ ఇద్ద‌రి డ్రెస్ కోడ్ ఇంచుమించు ఒకేలా ఉంది. ఇద్ద‌రూ వైట్ అండ్ వైట్ లో జెంటిల్ మేన్ లా క‌నిపించారు.

అభ‌మానుల క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య వ‌రుణ్ తేజ్ అద్భుత‌మైన స్పీచ్ ని ఇచ్చాడు. వ‌రుణ్ మాట్లాడుతుండ‌గా ఇక్క‌డా ప‌వ‌ర్ స్టార్ అంటూ అభిమానులు సంద‌డి చేశారు. దీంతో వ‌రుణ్ మ‌ధ్య‌లో స్పీచ్ ఆపి - చిరంజీవి - ప‌వ‌న్ కల్యాణ్ నా వెన‌కే ఉన్నారు... చ‌ర‌ణ్ రూపంలో. ఆ ఇద్ద‌రినీ ఆయ‌న‌లో చూసుకోండి.. అని అన్నాడు వ‌రుణ్‌. ఇక  ఈ క‌థ ఓకే చెప్ప‌డానికి ముందు జ‌రిగిన సంగ‌తుల్ని వ‌రుణ్ చెప్పాడు. ఎప్పుడూ కొత్త‌గా వెరైటీగా చేద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తాను. సంక‌ల్ప్  క‌థ చెప్పిన‌ప్పుడు కొత్త‌గా చేద్దామ‌ని మోటివేట్ అయ్యాను. మ‌న‌కు ప్ర‌తివారం సినిమాలొస్తాయి. కానీ అంత‌రిక్షం లాంటి వి అరుదుగా వ‌స్తాయి. తొలి సినిమాతోనే దిల్లీ నుంచి ప్ర‌శంస‌లు అందుకుని - జాతీయ అవార్డు అందుకున్నాడు సంక‌ల్ప్. ఇప్పుడు మ‌రో కొత్త పాయింట్‌ తో సినిమా తీశాడు... అని పొగిడేశాడు త‌న ద‌ర్శ‌కుడిని.

స‌మ‌ర్ప‌కుడు క్రిష్ మాట్లాడుతూ .. ``సంక‌ల్ప్ తెలుగు సినిమా ద‌ర్శ‌కుడు అయినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నా.. తెలుగు ద‌ర్శ‌కుడిగా నిర్మాత‌గా గ‌ర్వంగా ఫీల‌వుతున్నా. నేను రాజీవ్ - మా బ్యాన‌ర్ లో ఈ సినిమా వ‌స్తున్నందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నా. డిసెంబ‌ర్ 21న తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమా చూసి ఆనందిస్తారు. తెలుగు వాళ్లం అని గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది`` అన్నాడు. వ‌రుణ్ ఇలాంటి స్క్రిప్టు అంగీక‌రించినందుకు థాంక్స్. రంగ‌స్థ‌లం - అంత‌రిక్షం ఇలా కొత్త‌గా హీరోలు ట్రై చేయాలి. .. అంటూ కోరాడు క్రిష్‌.
Tags:    

Similar News