తొలిప్రేమ.. 11 దాటింది.. రావట్లేదు!!

Update: 2018-02-01 05:54 GMT
సినిమా మొదలు పెట్టగానే అన్ని అనుకున్నట్లుగా చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్స్ చాలానే వేసుకుంటుంది. కానీ ఒక్కోసారి ఊహించని విధంగా పరిస్థితులు ఎదురవ్వడం కొన్ని పనులు వాయిదాలు పడుతుండడం ఈ రోజుల్లో చాలా కామన్. ఇక అసలు విషయానికి వస్తే వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా కూడా మొన్నటి వరకు అన్ని పనులను పక్కా ప్లాన్ తో చేసుకుంటూ వచ్చింది. కానీ ట్రైలర్ రిలీజ్ విషయంలో మాత్రం ఒక్కసారిగా మనసు మార్చుకుంది.

అసలైతే ఆ సినిమా ట్రైలర్ ఈ రోజు 11 గంటలకే రిలీజ్ చేయాలనీ అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ వాయిదా వేస్తున్నారని సమాచారం అందింది. మళ్లీ కొత్త డేట్ ని అనౌన్స్ చేస్తారట. సినిమా రిలీజ్ కు ఇంకా కరెక్ట్ గా 9 రోజుల టైమ్ ఉంది. అంటే ఫిబ్రవరి 10న రిలీజ్. సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం ఈ సినిమాను రిలీజ్ డేట్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది చూడాలి.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బివిఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిచారు. థమన్ సంగీతం అందిస్తుండగా రాశి ఖన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతానికి సినిమాపైన ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఓ పాట కూడా అందరికి తెగ నచ్చేస్తోంది. మరి సినిమా ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.
Tags:    

Similar News