మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని రాణిస్తున్నాడు. గతేడాది `గద్దలకొండ గణేష్`లో నెగటివ్ షేడ్ ఉన్నపాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే సినిమాలో వరుణ్ నటిస్తున్నాడు. దీనికి డెబ్యూ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లన్నీ రద్దు కావడంతో ఇంటి వద్దే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు వరుణ్ తేజ్ ఓ సీక్రెట్ వ్యాపారం మొదలు పెట్టబోతున్నాడు. బినామీ ప్రొడ్యూసర్ గా కొనసాగనున్నాడట. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్య చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్- సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సిద్ధు ముద్ద వరుణ్ తేజ్ స్నేహితుడు. ఆయన పేరుతో ఈ సినిమాలో వరుణ్ తేజ్ స్వయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడట.
నిజానికి బినామీ ప్రొడ్యూసర్ (స్లీపింగ్ పార్టనర్) గా వరుణ్ ఉండాల్సిన అసవరం ఏమిటి? ఇలా ఈ సీక్రెట్ వ్యాపారం ఎందుకు? అంటూ.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణాలపై ఆరా తీస్తే వరుణ్ టీమ్ నుంచి ఓ ఆసక్తికర అప్ డేట్ తెలిసింది. వరుణ్ ఇదివరకూ తన సోదరి నిహారిక నటించిన `సూర్యకాంతం` చిత్రానికి వరుణ్ సమర్పకుడిగా వ్యవహరించిన విషయం విదితమే. ఈ సినిమా అనూహ్యంగా ఫ్లాపైంది. సోదరికి ఒక హిట్టివ్వాలని కసిగా పని చేస్తే అది కాస్తా బెడిసికొట్టడం వరుణ్ ని నిరాశకు గురి చేసిందట.
అలాగే నిర్మాత అన్న ట్యాగ్ తమ కుటుంబానికి అచ్చి రాదని వరుణ్ భావిస్తున్నాడట. తన తండ్రి నాగబాబు కూడా నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిన విషయం విదితమే. అందుకే తమకు నిర్మాణం అచ్చి రాదని.. అందుకనే ఇలా స్లీపింగ్ పార్టనర్ గా వరుణ్ ఉంటున్నట్టు మరో వాదన వినిపిస్తుంది. మరి ఈ చిత్రమైనా తమకి వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి.