అప్పటివరకు అపజయాలతో సతమతమైన మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకొని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుణ్ తేజ్ నెక్స్ట్ కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ తోనే రాబోతున్నాడు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆ సినిమాను చేస్తున్నాడు. దానికి పవర్ స్టార్ తొలి ప్రేమ టైటిల్ ని కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఎప్పుడైతే తొలి ప్రేమ అనే టైటిల్ అని చెప్పారో సినిమాకు బారి స్థాయిలో ఆదరణ దక్కిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా అప్పుడే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా దర్శనం ఇచ్చాయి. సినిమా గురించి అప్డేట్స్ కూడా చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ఆడియెన్స్ కి తెలిసేలా చేస్తోంది. మొన్నటి వరకు షూటింగ్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ని ఇచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమా రిలీజ్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. రాశిఖన్నా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వాలెంటైన్స్ డే కి ముందు రోజు రిలీజ్ అవుతుండడం స్పెషల్ అని చెప్పుకోవాలి. బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.