'తొలిప్రేమ' టీజర్! ఇప్పుడెందుకు సామీ?

Update: 2017-12-18 16:59 GMT
ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలకు బజ్ లేదు నాయనోయ్.. ఆ సినిమాల తాలూకు టీజర్లను త్వరగా రిలీజ్ చేయండి సినిమా లవ్వర్స్ అందరూ హంగామా చేస్తుంటే.. ఇప్పుడు సందట్లో సడేమియా అన్నట్లు ఓ మెగా హీరో కూడా మధ్యలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎందుకో తెలియదు కాని.. అర్జెంటుగా టీజర్ చూపిస్తా అంటున్నాడు.

క్లీన్ షేవ్ లో ఉన్న లుక్కుతో ఆల్రెడీ 'తొలిప్రేమ' అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్లో రూపొందుతున్న ఈ లవ్ స్టోరీని ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరుణ్‌ గెడ్డంతో కూడిన లుక్కులో ఉన్న పోస్టర్ ఒకటి రిలీజైంది. ఈ పోస్టర్లో మనోడు యమా స్టయిలిష్‌ గా ఉన్నాడు. కాని పోస్టర్ ను ఎందుకు రిలీజ్ చేశారంటే.. డిసెంబర్ 20న ఉదయం 10 గంటలకు సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నారట. అయితే ఇంకా ఫిబ్రవరి 9కి చాలా టైమ్ ఉందిగా.. అప్పుడే టీజర్ ఎందుకు సామీ?

ఏదేమైనా కూడా.. వరుణ్‌మాత్రం లాస్ట్ మినిట్ లో హడావుడి చేయకుండా ముందు నుండే బజ్ ను పెంచుకుంటూ పోవాలని ప్లాన్ చేస్తున్నట్లున్నాడు. ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News