టాలీవుడ్ లో స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల వెల్లువ స్పష్ఠంగా కనిపిస్తోంది. ఓవైపు ఇస్మార్ట్ పూరి విజయ్ దేవరకొండను ఫైటర్ గా చూపించబోతున్నాడు. పాన్ ఇండియా ప్రయత్నం కాబట్టి.. అందుకు తగ్గట్టే ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. రౌడీ విజయ్ ఏకంగా 10 మంది విదేశీ కోచ్ ల సమక్షంలో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. అలాగే మరోవైపు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం తనకు ఓ స్పెషలిస్ట్ కోచ్ ని సెట్ చేసుకుని ఏకంగా ప్రొఫెషనల్ బాక్సర్ గా మారేందుకు ట్రై చేస్తున్నాడు. ఇదంతా యువహీరోల అసాధారణ తపన అనే చెప్పాలి.
ఇది కేవలం నటనే అయినా దానిని ఎంతో ఛాలెంజింగ్ గా భావించి ప్రత్యేకించి శిక్షణ పొందుతున్నారు వీళ్లంతా. విజయ్ దేవరకొండ ఇంతకుముందు దాదాపు 40 రోజుల పాటు థాయ్ ల్యాండ్ కి చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుల వద్ద శిక్షణ పొందాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఏకంగా ఇండియాస్ ది బెస్ట్ బాక్సర్ నీరజ్ గోయత్ వద్ద శిక్షణ పొందనున్నాడు. నీరజ్ ఇప్పటికే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్ లో ఇండియా తరపున ది బెస్ట్ ర్యాంకర్ గా ఉన్నాడు. అలాంటి స్పెషలిస్ట్ సమక్షంలో వరుణ్ బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకోబోతున్నాడు.
ఇక వరుణ్ ఇంతకుముందే గద్దల కొండ గణేష్ చిత్రంలో నటించేప్పుడు ఆంగ్ల బాక్సర్ టోనీ జెఫ్రీ వద్ద శిక్షణ పొందాడు. ఇప్పుడు ఇండియా స్పెషలిస్ట్ నీరజ్ వద్ద నెలరోజుల పాటు శిక్షణ పొందేందుకు రెడీ అవుతున్నాడు. బాక్సింగ్ లో టెక్నిక్స్ ని ఔపోషణ పట్టాక సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లారెన్ స్టోవల్ ని బరిలో దించిన వరుణ్ తేజ్ - కిరణ్ కొర్రపాటి బృందం ప్రీప్రొడక్షన్స్ లో వేగం పెంచింది. లార్నెల్ ఇంతకుముందు సల్మాన్ నటించిన సుల్తాన్ చిత్రానికి ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేశాడు. ఇప్పుడు వరుణ్ ని అతడు మరో లెవల్లో ఆవిష్కరిస్తాడన్న నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. అల్లు బాబి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీస్ నభా నటేష్- నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.