వీర సింహారెడ్డి ఈవెంట్ కి లైన్ క్లీయర్‌.. ఆ ఒక్కటే మార్పు

Update: 2023-01-05 04:30 GMT
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులోని ఏబీఎన్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేసిన తర్వాత పోలీసులు భద్రత కారణాల వల్ల అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు ఇవ్వలేం అంటూ చేతులు ఎత్తేయడంతో మైత్రి వారు హైదరాబాద్‌ లో ప్రీ రిలీజ్ వేడుక చేసే యోచన చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒంగోలు లోనే వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ని నిర్వహించబోతున్నారు. అయితే వేదికను మార్చడం జరిగింది. ఒంగోలు బైపాస్ రోడ్డులోని బీఎంఆర్ మహానాడు మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు గాను కండీషన్స్ తో కూడిన అనుమతులు పోలీసులు ఇచ్చారట.

ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 6వ తారీకున ఒంగోలులోనే ఏబీఎన్‌ గ్రౌండ్స్ లో కాకుండా మహానాడు మైదానంలో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు మొదలు అయ్యాయి. బాలయ్య మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి అంటూ మైత్రి మూవీ మేకర్స్‌ వారి నుండి సమాచారం అందుతోంది.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌ గా శృతి హాసన్‌ నటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా కచ్చితంగా బాలయ్య కు మరో అఖండ విజయాన్ని తెచ్చి పెడుతుంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వంద కోట్ల కలెక్షన్స్ లక్ష్యంతో ఈ సినిమా రిలీజ్ కు సిద్దం అయ్యింది. ప్రీ రిలీజ్‌ వేడుక విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగి పోవడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News