వీర సింహా రెడ్డి ఇంటర్వెల్ సీన్ అరుపులు కేకలే..!

Update: 2023-01-09 09:30 GMT
నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న వీర సింహారెడ్డి రిలీజ్ ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్టే అని తెలుస్తుంది. జనవరి 12న సంక్రాంతి పండుగని ముందే తెచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో ఒక క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ గురించి ఒక లీ బయటకు వచ్చింది.

ఆ సీన్ తో థియేటర్ దద్దరిల్లిపోతుందని అంటున్నారు. గోపీచంద్ మార్క్ యాక్షన్.. బాలయ్య మార్క్ వీరత్వం చూపించేలా ఇంటర్వెల్ సీన్ మొదలై ఒక ఎమోషన్ తో ముగుస్తుందని తెలుస్తుంది.

సీనియర్ బాలకృష్ణకు చెల్లి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. అయితే అన్నయ్య ని నమ్మించి కత్తిపోటు తో బాలయ్యని చంపేస్తుందట.. ఈ ఇంటర్వెల్ సీన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని.. యాక్షన్ కి యాక్షన్.. ఎమోషన్ కి ఎమోషన్ రెండు కలిపి గోపీచంద్ మలినేని అదరగొట్టేశాడని అంటున్నారు.

ఇదే నిజమైతే బాలయ్య వీర సింహారెడ్డి ఇంటర్వెల్ సీన్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సినిమాపై బజ్ చూస్తుంటే సంక్రాంతికి మరోసారి బాలయ్య వీర సింహా రెడ్డి బీభత్సం సృష్టించేలా ఉంది.

ఓ పక్క మాస్ యాక్షన్.. మరో పక్క ఎమోషన్ ఇలా రెండిటిని మిక్స్ చేసి గోపీచంద్ ఈ సంక్రాంతికి నందమూరి ఫ్యాన్స్ కు మంచి ఐ ఫీస్ట్ అందించే సినిమా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అఖండతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య మరోసారి ఆ సినిమా రిజల్ట్ ని వీర సింహా రెడ్డితో రిపీట్ చేయాలని చూస్తున్నాడు. సినిమా ఫైనల్ కాపీ చూసిన బాలయ్య పూర్తిగా నమ్మకంతో ఉన్నట్టు అర్థమవుతుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమా పక్కా హిట్ అనే కాన్ఫిడెన్స్ అందరి మాటల్లో కనిపించింది. పోటీగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా వస్తుండగా తప్పకుండా వీర సింహా రెడ్డి కి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. విజయ్ వారసుడు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాడు. మరి ఈ సినిమాల్లో ఏది సంక్రాంతి విన్నర్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News