'వీర సింహారెడ్డి' యూఎస్ ప్రీమియర్ టాక్‌

Update: 2023-01-12 03:59 GMT
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వీర సింహారెడ్డి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో స్క్రీనింగ్ పడకుండానే యూఎస్ లో ఈ సినిమా విడుదల అయ్యింది. యూఎస్ లో నందమూరి అభిమానులు భారీ ఎత్తున ప్రీమియర్ షో లకు అడ్వాన్స్ బుకింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

భారీ ఎత్తున యూఎస్ లో ప్రీమియర్ షో లు పడ్డాయి. బాలకృష్ణ అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా యూఎస్ లో వీర సింహారెడ్డి సినిమా ప్రీమియర్ షోకు హాజరు అయ్యారు. యూఎస్ నుండి వీర సింహారెడ్డి సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. యూఎస్ నుండి చాలా మంది ట్విట్టర్ ద్వారా వీర సింహారెడ్డి సినిమా టాక్ ను షేర్‌ చేసుకుంటూ ఉన్నారు.

ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు బాలయ్య లుక్ కు మరియు ఆయన పాత్రకు ఫిదా అయ్యాం అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక నెగటివ్ విషయాలకు వస్తే రొటీన్ సీమ బ్యాక్ డ్రాప్‌ మరియు గతంలో చూసిన ఫ్యాక్షన్ స్టోరీనే అంటూ పెదవి విరుస్తున్నారు. బాలయ్య మరియు వరలక్ష్మి శరత్‌ కుమార్ ల కాంబో సన్నివేశాలు పైసా వసూళ్‌ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

వీర సింహారెడ్డి ఫ్యాన్స్ కు పండుగ అన్నట్లుగా ఉందని కామెంట్స్‌ వస్తున్నాయి. సినిమా సెకండ్‌ హాఫ్ తో పాటు ఫస్ట్‌ హాఫ్‌ లోని కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా సాగాయట. అంతే కాకుండా కొన్ని కామెడీ సన్నివేశాలు బలవంతంగా ఇరికించే ప్రయత్నం జరిగిందని.. అవి ఆకట్టుకోలేదని కూడా యూఎస్ రిపోర్ట్‌.. పూర్తి రివ్యూ రావాల్సి ఉంది. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కి సంక్రాంతి ముందే వచ్చినట్లు థియేటర్ల వద్ద హడావుడి కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News