కొత్త దర్శకుడన్నాక చాలా వరకు సేఫ్ గేమ్ ఆడటానికే ప్రయత్నిస్తాడు. కమర్షియల్ ఫార్మాట్లో సినిమా తీయడానికే మొగ్గు చూపుతాడు. ఐతే రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాత్రం దర్శకుడిగా తన తొలి సినిమాకు పెద్ద రిస్కే చేస్తున్నాడు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా అతను తీయబోతున్న సినిమాలో హీరో అంధుడు కావడం విశేషం. ఈ సినిమాకు ‘అంధగాడు’ అనే టైటిల్ కూడా నిర్ణయించడం గమనార్హం.
ఈ చిత్రం ప్రారంభోత్సవం వి.వి.వినాయక్ చేతుల మీదుగా జరుపుకుంది. వెలిగొండ శ్రీనివాస్ స్క్రిప్టు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు విపరీతంగా నచ్చేసి ఈ సినిమాపై చాలా ఆసక్తిని ప్రదర్శించడం విశేషం. హీరోగా రాజ్ తరుణ్ ను రికమండ్ చేసింది కూడా ఆయనేనట. సుక్కు ‘కుమారి 21 ఎఫ్’లో హీరో హీరోయిన్లుగా నటించిన రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జంటే ఈ చిత్రంలోనూ లీడ్ రోల్స్ చేస్తున్నారు. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత.
అనిల్.. రాజ్ తరుణ్ తో ఒకేసారి మూడు సినిమాలు నిర్మిస్తున్నాడు. అందులో ఇదొకటి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ‘అంధగాడు’ ఒక స్ట్రాంగ్ పాయింట్ నేపథ్యంలో సాగే సినిమా అని.. రాజ్ తరుణ్ కెరీర్లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని.. తనకూ దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుందని వెలిగొండ శ్రీనివాస్ అన్నాడు. శ్రీనివాస్ జబర్దస్త్.. ఢమరుకం.. అఖిల్.. పండగచేస్కో లాంటి సినిమాలకు రచయితగా పని చేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/