టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున - కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన ఊపిరి చిత్రం థియేటర్లలో విజయయాత్ర చేస్తూనే ఉంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ కమర్షియల్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించిన తీరు, యాక్టర్ల పెర్ఫామెన్స్ ను ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. ఊపిరి చిత్రాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోసం ప్రత్యేక ప్రదర్శన వేశారు.
హైద్రాబాద్ లో ఈ సినిమాను చూసిన వెంకయ్య.. ఊపిరిని విపరీతంగా పొగిడేశారు. ముఖ్యంగా పారాప్లెజిక్ గా నాగార్జున నటించిన తీరు అద్భుతం అన్నారు వెంక్య. ఈ మధ్య కాలంలో తాను చూసిన ఉత్తమమైన చిత్రాల్లో ఊపిరి టాప్ లో ఉంటుందని చెప్పడం విశేషం. ఇంత మంచి సినిమాను తీసిన యూనిట్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు వెంకయ్య. ఫ్రెంచ్ మూవీ ఇన్ టచబుల్స్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాని.. దర్శకుడు వంశీ పైడిపల్లి అత్యద్భుతంగా లోకలైజ్ చేశాడు. ప్రధానంగా నటీనటుల ఎంపికే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి.
నాగార్జున కాకుండా ఆ రోల్ లో వేరే వారిని ఊహించుకోవడం కష్టం అనే మాట వినిపిస్తోంది. ఇక తొలివారంలో 26 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రం.. ఈ వారం కూడా జోరు చూపిస్తోంది. డజన్ కు పైగా సినిమాలు విడుదలైనా.. ఊపిరి ప్రభంజనమే సాగుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.