`బాహుబలి` తరువాత పాన్ ఇండియా స్థాయి చిత్రాల పరంపర దక్షిణాదిలో మరీ ఎక్కువైపోతోంది. ఏ హీరోని కదిలించినా ఇదే మాట. పాన్ ఇండియా పాన్ ఇండియా. ఇటీవల విడుదలై ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 దేశ వ్యాన్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా సంచలన విజయాలని సాధించాయి. దీంతో ఇప్పడు అందరి దృష్టి దక్షినాదిపై పడింది. దీన్ని క్యాష్ చేసుకోవాలని ప్రతీ ఒక్కరు పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి చిత్రాల వైపే మొగ్గుచూపుతున్నారు.
ఇదిలా వుంటే చాలా మంది డైరెక్టర్ లు ఇద్దు స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేయాలని స్కెచ్ లు వేస్తున్నారు. బాహుబలిలో ప్రభాస్ రానా కలిసి నటించారు.ఆ తరువాత ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన లభించడంతో ఇద్దరు స్టార్ లతో మల్టీస్టారర్ మూవీస్ చేయాలనే దర్శకుల లిస్ట్ పెరుగుతోంది. తమిళంలో మణిరత్నం `పొన్నియిన్ సెల్వన్` అనే ఓ బుక్ ఆధారంగా ప్రస్తుతం చారిత్రక నేపథ్యంలో `పొన్నియిన్ సెల్వన్` ని తెరకెక్కిస్తున్నారు.
బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ చిత్రాల తరహాలో ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు మరానుంది. ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మ, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, ప్రభు తదితరులు నటిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుంటే తమిళంలో మరో భారీ మల్టీస్టారర్ మూవీ రాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఈ మల్టీస్టారర్ మూవీలో తల అజిత్, దళపతి విజయ్ నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
తమిళనాట వీరికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరు హీరోల మధ్య ప్రతీసారి బాక్సాఫీస్ వార్ జరుగుతూనే వుంటుంది. అలాంటి ఈ ఇద్దరు హీరోలతో వెంట్ ప్రభు మల్టీస్టారర్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఓ కాలేజీ వేడుకలో పాల్గొన్న వెంకట్ ప్రభు స్టార్ హీరోలైన తల అజిత్, దళపతి విజయ్ తో మల్టీస్టారర్ చేయాలని వుందని ప్రకటించాడు. అంతే కాకుండా ఆ ఇద్దరు హీరోలకు సరిపోయే స్క్రిప్ట్ కూడా తన దగ్గర సిద్ధంగా వుందని చెప్నపడంతో కోలీవుడ్ లో చర్చ మొదలైంది.
వెంకట్ ప్రభు ఇంత వరకు భారీ సినిమాలు చేయలేదు. 2011లో హీరో అజిత్ తో `మంకత` మూవీ చేశాడు. విజయ్ తో అయితే ఆ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు స్టార్ హీరోలని కలిపి మల్టీస్టారర్ చేయడం వెంకట్ ప్రభుకు కుదిరేపని కాదు. అంతే కాకుండా విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య గత కొన్నేళ్లుగా వర్డ్స్ ఆఫ్ వార్ జరుగుతోంది. అజిత్ ఫ్యాన్స్ విజయ్ చనిపోయాడంటూ ఫొటోలని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఇటీవల పెద్ద రచ్చకు తెరలేపారు కూడా.
ఇలాంటి నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ అంటే ఫ్యాన్స్ అంగీకరించడం కష్టం. అంటే వెంకట్ ప్రభు మల్టీస్టారర్ అనేది కలే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మరి వెంకట్ ప్రభు కలని నిజం చేస్తారా? లేక విమర్శలనే నిజం చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.