టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య - కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా చైతూ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విలక్షణ దర్శకుడు కంఫర్మ్ చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. "నా తదుపరి చిత్రం తెలుగులోనే ఉంటుంది. నాగ చైతన్య కథానాయకుడిగా నటించనున్నారు'' అని తెలిపారు. ఇందులో చైతూ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వెంకట్ ప్రభు స్పందిస్తూ.. 'నాగ చైతన్యతో పాటు పలువురు స్టార్స్ నటిస్తారు. అయితే వాటిలో ఏదీ ఇంకా కంఫర్మ్ కాలేదు' అని చెప్పారు. ఇదే క్రమంలో బ్లాక్ బస్టర్ 'మానాడు' చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
రెండు వెర్సన్ లో హీరోలు వేరని.. విలన్ మాత్రం ఎస్ జె సూర్య అని వెంకట్ తెలిపారు. అంతేకాదు తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో 'మానాడు' రీమేక్ ని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇకపోతే అశోక్ సెల్వన్ హీరోగా వెంకట్ ప్రభు తీసిన 'మన్మథ లీల' సినిమా ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది.
ఈ క్రమంలో నాగచైతన్య సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. 'గోవా' 'సరోజ' 'గ్యాంబ్లర్' 'రాక్షసుడు' వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన వెంకట్ ప్రభు.. స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి.
నాగచైతన్య విషయానికొస్తే.. ఇటీవల 'బంగార్రాజు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తన డిజిటల్ డెబ్యూ కోసం విక్రమ్ కె కుమార్ తో కలిసి 'దూత' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. హిందీలో ఎంట్రీ ఇవ్వబోతున్న 'లాల్ సింగ్ చద్దా' మూవీ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇక చైతూ లైనప్ లో పరశురామ్ పెట్లా - విజయ్ కనకమేడల - కిషోర్ తిరుమల - రాహుల్ సంకృత్యాన్ వంటి దర్శకులు ఉన్నారు.