వెంకీ-మారుతి.. రాధాకృష్ణ

Update: 2015-11-14 07:30 GMT
విక్టరీ వెంకటేష్‌ కు లేడీ టైటిళ్లు బాగా సూటవుతాయని పేరు. లక్ష్మీ - తులసి లాంటి సినిమాలు అందుకు నిదర్శనం. ఈ కోవలోనే మారుతి దర్శకత్వంలో ఇంతకుముందు ‘రాధ’ అనే సినిమా మొదలుపెట్టాడు. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఐతే ఈ మధ్యే ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చి మళ్లీ వెంకీని మెప్పించాడు మారుతి. దీంతో మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ తెరపైకి వచ్చింది.

ముందు అనుకున్న కథలో కొన్ని మార్పులు జరిగాయి. స్క్రిప్టు పకడ్బందీగా సిద్ధమైంది. సినిమా ఓకే అయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే ఒకసారి ఆగిపోయిన సినిమా కాబట్టి సేమ్ టైటిల్ కంటిన్యూ చేస్తే బాగోదని.. ఇప్పుడు టైటిల్ మార్చేశారు. పాత టైటిల్‌ పొడిగించి.. ‘రాధాకృష్ణ’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలిసింది.

ఇంతకుముందు అనుకున్నట్లే నయనతారనే ఇందులో హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. వెంకీ-నయన్ కాంబినేషన్ లో ఇంతకుముందు లక్ష్మీ - తులసి లాంటి హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. సితార క్రియేషన్స్ అనే మరో సంస్థతో కలిసి వెంకీ అన్నయ్య సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మారుతి స్టయిల్లోనే మీడియం బడ్జెట్ తో, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఈ నెలలోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.
Tags:    

Similar News