నాగ్ 100..వెంకీ 75 మైల్ స్టోన్స్ పై స్పెష‌ల్ ఫోక‌స్!

Update: 2022-12-10 12:30 GMT
కింగ్ నాగార్జున‌..విక్ట‌రీ వెంక‌టేష్ ల్యాండ్ మార్క్ చిత్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారా?  చిరంజీవి..బాల‌య్య త‌ర‌హాలో మైల్ స్టోన్ చిత్రాలు స్పెష‌ల్ గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. నాగార్జున సెంచ‌రీకి చేరువ‌య్యారు.  ప్ర‌స్తుతం ది ఘోస్ట్ 99వ చిత్రంగా ప్ర‌చారంలోకి వ‌చ్చినా అది  98 గా లెక్క తేలింది. దీంతో 99వ సినిమా ఇప్ప‌టికే లాక్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకి  ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే ప‌లు హిట్ సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన ప్ర‌సన్న కింగ్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌థ లాక్ అయింద‌ని స‌మాచారం. నాగార్జున ఇమేజ్ కు త‌గ్గ ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ స్ర్కిప్ట్ అని తెలుస్తోంది.

అటుపై 100వ చిత్రాన్ని మాత్రం చాలా స్పెష‌ల్ గా ఉండేలా చూసుకుంటున్నారు. కెరీర్ కిది మైల్ స్టోన్ మూవీ కాబ‌ట్టి క‌చ్చితంగా హిట్ కంటెంట్ తోనే రావాల‌ని ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఓ పెద్ద ద‌ర్శ‌కుడితో ఈ సినిమా చేయాల‌ని పావులు క‌దుపుతున్నారు. ఈ రేసులో మోహ‌న్ రాజా..విక్ర‌మ్. కె. కుమార్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్లు ఉన్నారు. ఇప్ప‌టికే వాళ్లు కూడా క‌థ‌లు వినిపించిన‌ట్లు స‌మాచారం. వీళ్ల‌లో ఎవ‌రో ఒక‌రితో నాగ్ సెంచ‌రీ కొట్టే అవ‌కాశం ఉంద‌ని బ‌లంగా వినిపిస్తుంది. అలాగే విక్ట‌రీ వెంక‌టేష్ 74 చిత్రాలు పూర్తిచేసి 75వ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

చివ‌రిగా 'ఎఫ్ 3' తో మెప్పించిన త‌ర్వాత ఇంత వ‌ర‌కూ కొత్త ద‌ర్శ‌కుడ్ని ఫైన‌ల్ చేయ‌లేదు. ఈ జాప్యం వెనుక అస‌లు కార‌ణం ల్యాండ్ మార్క్ చిత్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే స‌రైన ద‌ర్శ‌కుడ్ని..క‌థ‌ని ఎంపిక చేసుకోవాల‌ని డిలే చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. ఇప్ప‌టికే వెంకీ లిస్ట్ లో యంగ్ డైరెక్ట‌ర్  త‌రుణ్ భాస్క‌ర్ స‌హా కొంత మంది ఉన్నారు. కానీ వాళ్ల‌తో 75వ సినిమా క‌రెక్టేనా? అన్న మీమాంస లో ఉండిపోయారు.

హిట్ కంటెంట్ తోనే రావాల‌ని స‌రైన క‌థ కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఎలాంటి రీమేక్ కాకూడ‌ద‌ని భావిస్తున్నారుట‌. స్ర్టెయిట్ తెలుగు క‌థ‌లోనే న‌టించి హిట్ అందుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌ట‌న ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News