మామూలు స్టోరీకి అన్ని ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి హిట్ కొట్టడం డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టయిల్. పటాస్ - సుప్రీం - రాజా ది గ్రేట్ సినిమాలు హిట్ కావడానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే యే కారణం. హ్యాట్రిక్ హిట్ తరవాత ఈ డైరెక్టర్ మల్టీ స్టారర్ సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు.
విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్2 అనే సినిమా తీస్తున్నాడు అనిల్ రావిపూడి. ఎఫ్2 అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఇద్దరు ఫ్రస్ట్రేటెడ్ మగాళ్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలతో టోటల్ హ్యూమరస్ గా సినిమాగా సాగిపోతుంది. ఈ మూవీలో తమన్నా - మెహరీన్ లు వెంకటేష్ - వరుణ్ లకు జోడీగా నటిస్తున్నారు. వెంకటేష్ పెళ్లయిన వ్యక్తిగా కనిపించనుండగా.. వరుణ్ మెహరిన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న యువకుడిగా నటించనున్నాడు. ఈ ఇద్దరి జీవితంలో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో పీక్స్ కు చేరింది... అది తగ్గడానికి ఏం చేశారన్న కాన్సెప్ట్ తో ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది.
వెంకటేష్ కు కామెడీ సినిమాలేం కొత్తకాదు. ఆయన కెరీర్ లో ఎన్నోసార్లు ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ చేశాడు. ఎటొచ్చీ వరుణ్ ఎక్కువగా లవర్ బోయ్ క్యారెక్టర్ లోనే కనిపించాడు. తొలిసారి అతడిలోని కామెడీ యాంగిల్ ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతుందని సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.