బాబు బంగారంలా వ‌స్తాడు.. లుక్కుతో!

Update: 2016-03-27 07:32 GMT
వెంకీ గ‌తేడాదంతా ఖాళీగానే గ‌డిపాడు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత త‌న స‌మ‌యాన్నంతా కుటుంబానికే కేటాయించాడు. ఆ విషాదం నుంచి  కోలుకున్నాకే క‌థ‌ల‌పై మ‌న‌సుపెట్టాడు. నాలుగైదు క‌థ‌ల్ని సిద్ధం చేయించి రంగంలోకి దిగాడు. ఈ యేడాది మాత్రం క‌నీసం మూడు సినిమాల‌తోనైనా  ప్రేక్ష‌కుల్ని అల‌రించాల‌నుకొంటున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే వుంది ఆయ‌న వేగం. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న `బాబు బంగారం` సినిమా ఇప్ప‌టికే చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. వెంకీ ప్రోత్సాహంతోనే ఆ సినిమా అంత వేగంగా పూర్త‌వుతోంది. రేపోమాపో కొత్త సినిమాల్నీ అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నాడు. ఆలోపు `బాబు బంగారం`కి సంబంధించిన హ‌డావుడి కూడా మొద‌లు కాబోతోంది.  ఏప్రిల్ 8న ఫ‌స్ట్ లుక్‌ ని విడుద‌ల చేయాల‌ని డిసైడైయ్యాడు వెంకీ. స్టిల్‌ తో పాటు ఓ టీజ‌ర్ కూడా  ఆ రోజునే విడుద‌ల కాబోతోంద‌ట‌.
 
ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ కూడా ఏప్రిల్ 8నే విడుద‌ల‌వుతుంద‌న్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌ - వెంక‌టేష్ మంచి స్నేహితులు. గ‌తేడాది ఇద్ద‌రూ క‌లిసి గోపాల గోపాల చేశారు.  ఆ త‌ర్వాత ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ చేస్తే, వెంకీ బాబు బంగారం చేస్తున్నారు. కానీ మ‌రోసారి  ఇద్దరూ క‌లిసే హ‌డావుడి చేయాల‌ని డిసైడైయ్యారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు వెంక‌టేష్   బాబు బంగారం ఫ‌స్ట్ లుక్‌ ని స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ సినిమాతోపాటే విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలిసింది. అదే జ‌రిగితే ప‌వ‌ర్‌ - విక్ట‌రీ ఫ్యాన్స్ మ‌రింత ఖుషీ అవుతారు. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బాబు బంగారంలో వెంక‌టేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌య‌న‌తార న‌టించింది. 
Tags:    

Similar News