వెంకటేష్ బాబు రెడీ అయిపోయాడు

Update: 2016-04-03 17:30 GMT
‘గోపాల గోపాల’ తర్వాత దాదాపు ఏడాది విరామం తీసుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’తో ఊపు మీదున్న యువ దర్శకుడు మారుతితో జట్టు కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో మొదలైన ‘బాబు బంగారం’ షూటింగ్ తుది దశకు వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లోనే టాకీ పార్ట్ పూర్తయిపోతుంది. సమ్మర్ సందడి ముగిశాక జూన్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ లోపు సినిమాను బాగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ‘బాబు బంగారం’ ఫస్ట్ లుక్ పోస్టర్ - టీజర్ కూడా ఇప్పటికే రెడీ అయిపోయినట్లు సమాచారం.

ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫస్ట్ టీజర్ విడుదలవుతుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి స్టయిల్లోనే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందట. వెంకీ చాన్నాళ్ల తర్వాత తనదైన శైలిలో కామెడీ పండించబోతున్నట్లు సమాచారం. ఇందులో వెంకీ కామెడీ పోలీస్ పాత్ర చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకుముందు వెంకీతో ‘రాధ’ అనే సినిమా మొదలుపెట్టి ఆపేసిన మారుతి.. ‘భలే భలే..’ తర్వాత మళ్లీ వెంకీ నుంచి పిలుపందుకుని సరికొత్త కథతో ఆయన్ని మెప్పించాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Tags:    

Similar News