విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా థియేటర్స్ లో సందడి చేస్తుది. దీపావళి కానుకగా మూడు రోజుల ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ హిట్టైన సినిమా కాబట్టి రిజల్ట్ కూడా దాదాపు అదే వస్తుందని ముందునుండి అనుకుంటుందే.. ఈ క్రమంలో శుక్రవారం రిలీజైన ఓరి దేవుడా సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. పోటీగా మరో మూడు సినిమాలు ఉన్నా సరే విశ్వక్ సేన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఓరి దేవుడా మూవీని మాత్రుక దర్శకుడు అశ్వత్ మారిముత్తునే డైరెక్ట్ చేశారు. భాష మారినా కథలో ఫీల్ ని ఏమాత్రం మిస్ అవకుండా తెరకెక్కించారు.
ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ నటించడం మరో హైలెట్ అని చెప్పొచ్చు. వెంకటేష్ ఉన్నాడు అని తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపిస్తారు. తమిళంలో ఈ పాత్రని విజయ్ సేతుపతి చేశారు. ఓ మై కడవులే తెలుగు రీమేక్ ప్రయత్నాలు చేస్తుండగానే ఆ పాత్ర ఎవరితో చేయించాలా అన్న కన్ ఫ్యూజన్ ఏర్పడ్డది. అయితే వెంకటేష్ కి చెప్పగానే ఆయన ఓకే చెప్పడం.. సినిమా చేయడం జరిగిందట. ఈ సినిమా కోసం వెంకటేష్ కేవలం ఐదు రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని తెలుస్తుంది.
ఈ 5 డేస్ కోసం వెంకటేష్ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని చెబుతున్నారు. ఓరి దేవుడా సినిమా కోసం విక్టరీ వెంకటేష్ కేవలం కోటిన్నర మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆయన చేసింది ఐదు రోజుల షూటే అయినా సినిమా పోస్టర్స్ లో వెంకటేష్ కనిపించడం ఓరి దేవుడా సినిమాని ఇంకా ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేసింది. అంతేకాదు సినిమా బిజినెస్ కి ఇది చాల హెల్ప్ అయ్యింది. పెద్ద స్టార్ అయ్యుండి యువ హీరో సినిమాలో నటిచడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు వెంకటేష్. సినిమాలో వెంకటేష్, విశ్వక్ సేన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారు. మొత్తానికి ఓరి దేవుడా సినిమాలో వెంకటేష్ ని చాలా తక్కువకే వాడేశారని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.