సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కు 'F2' విజయం మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో వరసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. వెంకీ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీమామ' లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'పెళ్ళి చూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ గతంలోనే హైదరాబాద్ రేస్ క్లబ్ నేపథ్యంలో ఒక కథ వినిపించారట. ఆ సినిమాకే వెంకీ పచ్చజెండా ఊపారని సమాచారం.
తరుణ్ భాస్కర్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్కును ఇప్పటికే కంప్లీట్ చేశారని.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారని అంటున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డీ. సురేష్ బాబు నిర్మిస్తారు. మలక్ పేట్ లో ఉండే రేస్ క్లబ్ నేపథ్యంలో తెరకెక్కే కథ కావడంతో ఎక్కువ బడ్జెట్ అవసరం లేదని.. మినిమం బడ్జెట్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో వెంకీ ఒక పంటర్ పాత్రలో నటిస్తారని.. హైదరాబాదీ యాసలో మాట్లాడతారని అంటున్నారు.
తరుణ్ భాస్కర్ తన మొదటి సినిమా 'పెళ్ళిచూపులు' తో కమర్షియల్ విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే రెండవ సినిమా 'ఈ నగరానికి ఏమైంది' మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. మూడో సినిమాకే వెంకీ లాంటి స్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం గొప్ప విషయమే. మరి ఈ సినిమాతో వెంకీకి ఒక సూపర్ హిట్ ఇస్తారా అనేది వేచి చూడాలి.