మేనల్లుడి పై మామకు ఉండే ప్రేమ.. అభిమానం ఎప్పుడూ ప్రత్యేకం. వెంకీమామ షూటింగ్ సమయంలోనే ఆ సంగతి బయటపడిందిట. ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు బాబి ఈ సంగతిని రివీల్ చేశారు. ఈ చిత్రంలో తన పాత్రను మించి నాగచైతన్య పాత్రపై దృష్టి సారించాల్సిందిగా వెంకీ మామ తనని కోరారట.
చైతూ పాత్రకు నటించేందుకు స్కోప్ ఎక్కువగా ఉంది. యాక్షన్ తో పాటు కామెడీ చేసేందుకు స్కోప్ ఎక్కువే.. అతడిపై ఎక్కువ దృష్టి సారించమని వెంకీ కోరారట. ఇప్పుడు అదే ప్రశ్న వెంకీనే అడిగేస్తే .. అవును.. అది నిజమే.. చైతన్యకు ఈ చిత్రంలో నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉంది. అందుకే అలా సజెస్ట్ చేశానని తెలిపారు. నాకు.. చైతన్యకు ఇది చాలా స్పెషల్ సినిమా అని తెలిపారు. వెంకీమామ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్. అందరికీ నచ్చుతుంది అని అన్నారు.
బాబి వినిపించిన స్క్రిప్టు ఆద్యంతం ఎమోషన్స్ తో నాకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమాని అంతే బాగా తీశాడు అని దర్శకుడు బాబీపై ప్రశంసలు కురిపించారు. మహేష్- పవన్- వరుణ్ తేజ్ లాంటి నవతరం స్టార్లతో నటించినప్పుడు సెట్స్ లో ఎంతో ఎంజాయ్ చేశానని వెంకీ తెలిపారు. అల్లుడు నాగచైతన్యతోనూ అంతే బాగా ఎంజాయ్ చేస్తూ చేశానని వెల్లడించారు. మొత్తానికి అల్లుడి కోసం మామ రియల్ గానే ఎంతో త్యాగానికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది తన మాటల్ని బట్టి.