బ్యూటీకి జోహార్లు చెబుతున్న వెంకీ

Update: 2016-09-10 16:28 GMT
విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా రిలీజ్ బాబు బంగారంతో ఓ విషయం మాత్రం తెలిసిపోయింది. ఫైనల్ రిజల్ట్ సంగతేమో కానీ.. బాబు బంగారం ఓపెనింగ్స్ తో వెంకీ స్టామినా ఏంటో బాగానే తెలిసొచ్చింది. మూవీ బాగానే ఉందనే టాక్ వచ్చినా.. ఫలితం ఇంకోలా ఉండేదన్న విషయం ఇటు వెంకీకి అటు టాలీవుడ్ కి తెలిసింది. అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో బోలెడన్ని టెక్నిక్స్ అప్లై చేస్తున్నాడీ ఫ్యామిలీ హీరో.

ఈ మధ్య కాలంలోనే వెంకటేష్ రెండు కొత్త సినిమాలు సైన్ చేసేశాడు. వీటిలో ఒకటి నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఉంటుంది. 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' అనే టైటిల్ పై ఈ మూవీ తెరకెక్కనుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు నిత్యామీనన్ ఓకే చెప్పడం విశేషం. సీనియర్ హీరో మూవీలో యంగ్ ట్యాలెంట్ బ్యూటీ సైన్ చేసిందా అనుకోవచ్చు కానీ.. తన కేరక్టర్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా సైన్ చేసేందుకు ఈ భామ ఎప్పుడూ సిద్ధమే అంటుంది. ఈ వెంకీ-కిషోర్ తిరుమల ప్రాజెక్టులో తన కేరక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కూడా చెప్పింది నిత్య.

ఈ మూవీలో వెంకటేషన్ తన రియల్ ఏజ్ కి దగ్గరగా ఉండే పాత్ర చేస్తుంటే.. అతనితో ప్రేమలో పడే కుర్రదాని పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుండగా.. పి.రామ్ మోహన్ రావు నిర్మాణం వహిస్తున్నారు.
Tags:    

Similar News