ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో చాలా సహజంగా జరిగే విషయమే. ఒక దర్శకుడు ఫలానా హీరో అని ఒకరిని దృష్టిలో పెట్టుకొని కథ తయారు చేసినా పలు కారణాల వల్ల ఆ హీరో ఆ కథను రిజెక్ట్ చేయవచ్చు. అలా అని ఆ కథను పక్కన పెట్టరు. వేరే హీరో దగ్గరకు తీసుకెళ్తారు. కొంత కాలం క్రితం తేజ - వెంకటేష్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. 'సావిత్రి' టైటిల్ తో ఆ సినిమాను తెరకెక్కిస్తారని కూడా అన్నారు. కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు.
ఇప్పుడు అదే కథను మార్చి బెల్లంకొండ శ్రీనివాస్ తో 'సీత' గా తెరకెక్కించాడట తేజ. మొదట తయారు చేసుకున్న కథ భార్యాభర్తల మధ్య ఉండే కాన్ ఫ్లిక్ట్.. ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందట. కానీ బెల్లంకొండ - కాజల్ జోడీ కోసం ఆ కథను ప్రేమికుల మధ్య జరిగే కథగా మార్చాడట. 'సావిత్రి' అనే టైటిల్ తో ఇప్పటికే నారా రోహిత్ హీరో గా ఒక సినిమా తెరకెక్కడంతో 'సీత' అనే టైటిల్ ఫైనలైజ్ చేసుకున్నాడట. కాజల్ పాత్ర పేరు సీత అనగానే ఫుల్ పాజిటివ్ అనుకుంటారేమో.. పేరు సీత అయినా నెగెటివ్ షేడ్స్ ఉంటాయట.
అలాంటి సీతను వేగలేక బెల్లంకొండ బాబు పడే కష్టాలతో కథ ఫన్ టోన్ లో సాగుతుందట. దర్శకుడిగా తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. మరి అదే ఊపు కొనసాగించి ఈ 'సీత' తో బెల్లంకొండ బాబు కు ఒక హిట్ ఇస్తాడేమో వేచి చూడాలి.