రాక్ లైన్ వెంకటేష్.. కన్నడలో టాప్ ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూటర్లకు ఫేవరెట్. ఐతే తెలుగు-తమిళ ఇండస్ట్రీల్లో మాత్రం అతడి పేరు చెబితే చాలామంది షేకైపోతారు. తిట్ల దండకం అందుకుంటారు. అందుక్కారణం ‘లింగా’ సినిమా. తక్కువ రోజుల్లో.. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను పూర్తి చేసిన రాక్ లైన్.. రజినీకాంత్ క్రేజ్ ను క్యాష్ చేసుకని భారీ రేట్లకు ఈ సినిమాను అమ్మాడు. ఐతే సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. రెండు చోట్ల బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. తమిళంలో అయినా డిస్ట్రిబ్యూటర్లకు కొంత పరిహారం చెల్లించాడు కానీ.. తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్లకు మాత్రం పైసా ఇవ్వలేదు. అందరూ దారుణంగా నష్టపోయారు. రాక్ లైన్ మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెడితే బయ్యర్లు అంత తేలిగ్గా వదిలేలా లేరు.
ఐతే రాక్ లైన్ మాత్రం మళ్లీ తెలుగులో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. మరాఠీలో చిన్న సినిమాగా విడుదలై 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సంచలనం రేపిన ‘సైరాత్’ సినిమాను తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి వెంకటేషే హక్కులు తీసుకున్నాడు. రైట్స్ కోసం చాలా పోటీ ఉన్నా.. రాక్ లైన్ ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి హక్కులు సొంతం చేసుకున్నాడు. మరి ఈ చిత్రాన్ని తెలుగులో ఏ దర్శకుడితో చేస్తాడో.. ఎవరెవరిని హీరోహీరోయిన్లుగా పెట్టుకుంటాడో.. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం తెలుగు రాష్ట్రాలకు వస్తే బయ్యర్లు ఎలా రెస్పాండవుతారో చూడాలి. ఆకేశ్.. రింకు రాజ్ గురు హీరో హీరోయిన్లుగా నటించిన ‘సైరాత్’ను నక్రి మంజులే అనే కొత్త దర్శకుడు రూపొందించాడు.