విక్టరీ వెంకటేష్ రీమేక్ లకు చాలా ప్రాధాన్యమిస్తాడు. వెంకీ నటించిన చాలా రీమేక్ సినిమాలు బ్లాక్ బస్టర్లు సాధించాయి. వెంకటేష్ లేటెస్ట్ రిలీజ్ గోపాలా గోపాలా కూడా హిందీ మూవీ ఓ మైగాడ్ కి రీమేక్. ఇప్పుడు వెంకటేష్ మరో బాలీవుడ్ సినిమాపై ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. సాలా ఖడూస్ పేరుతో హిందీలోను, ఇరుది సూత్రు పేరుతో తమిళ్ లోనూ ఓ మూవీ రూపొందింది.
రెండు భాషల్లోనూ ఒకే సారి తెరకెక్కించి, ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. హిందీ వెర్షన్ లో ఆది తోమర్ - తమిళ్ వెర్షన్ లో మాధవన్ హీరోలుగా నటించారు. మిగిలిన యాక్టర్స్ అంతా దాదాపు ఒకటే. బాక్సింగ్ స్పోర్ట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందించాడు డైరెక్టర్ సుధ కొంగర ప్రసాద్. ఈ వారం రిలీజ్ కానున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. అనేక భాషల నుంచి రీమేక్ కోసం ఎంక్వైరీలు వస్తుండగా.. తెలుగులో మాత్రం తనే డైరెక్ట్ చేస్తానంటున్నాడు సుధ కొంగర. ఇప్పటికే ఓ తెలుగు స్టార్ హీరో మూవీ చూశాడని, రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడని తెలిపాడు.
అయితే.. ఆ హీరో వెంకటేష్ అని ఈ డైరెక్టర్ చెప్పకపోయినా.. అసలు విషయం మాత్రం లీక్ అయింది. ప్రస్తుతం వీరి చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉండడంతోనే.. అధికారికంగా చెప్పలేదని అంటున్నారు. రీసెంట్ గా సంక్రాంతి రోజుల్లోనే మారుతీతో మూవీని మొదలుపెట్టిన వెంకటేష్.. ఒకవేళ సాలా ఖడూస్ రీమేక్ చేసేందుకు సిద్ధమైతే, మార్చి నుంచి ఒకేసారి షూటింగుల్లో పాల్గొనాలని అనుకుంటున్నాడట.