అక్కినేని రెండవ వారసుడిగా అఖిల్ మనం ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశలతో 'అఖిల్: ది పవర్ ఆఫ్ జువా' అంటూ అరంగేట్రం చేశాడు కానీ ఆ సినమా అట్టర్ ప్లాప్ అయ్యింది. రెండేళ్ల బ్రేక్ తర్వాత మళ్ళీ రీ-లాంచ్ అయిన మన సిసింద్రీ 'హలో' అంటూ పలకరించాడు. ప్రమోషన్లు ఒక రేంజ్ లో చేశారు.. సినిమా కూడా మంచి టాకే తెచ్చుకుంది కానీ కలెక్షన్ల పరంగా వచ్చింది ఏమి లేదు. మరి అఖిల్ ఇప్పుడు ఎం చేస్తున్నాడు.
రెండో సినిమాకి కూడా బాగా జాగ్రత్తలు చేపట్టినా సినిమా ప్లాప్ అయ్యేసరికి తండ్రి నాగార్జున ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొడుక్కి హిట్ అందించాల్సిందే అని డిసైడ్ అయిపోయాడు. అందుకే మళ్ళీ ఒక స్టార్ డైరెక్టర్ కి ఈ బాధ్యత అప్పగిద్దాం అనుకున్నాడు. కానీ కొరటాల శివ తో సహా అందరూ వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. అందుకే తొలి ప్రేమ తీసిన వెంకీ అట్లూరి కి ఈ ఛాన్స్ ఇచ్చినట్టు అంతకు ముందు టాక్ వచ్చింది. ఇప్పుడు అది దాదాపు కంఫర్మ్ అయిపోయింది. బాగా ఆలోచించి, తొలి ప్రేమ తీసిన విధానం బాగా నచ్చేసి నాగ్ అఖిల్ ను వెంకీ అట్లూరి తో సినిమా చేయిద్దాం అని ఫిక్స్ అయ్యాడు.
కొత్త డైరెక్టర్ అయినప్పటికీ తొలి ప్రేమ సినిమాతో ఇండస్ట్రీ మొత్తానికి తానేంటో నిరూపించేసుకున్నాడు. ఇది ఇతని రెండో సినిమా కాగా అఖిల్ కు మూడో సినిమా. ఒకరకంగా ఇద్దరూ కెరీర్ లో మొదట్లోనే ఉన్నారు. మరి వీరిద్దరూ కలిసి హిట్ అందుకోగలరు అంటారా? చూద్దాం.