ఫ్యాన్ అయితే సరిపోదు.. చిరు దర్శకుడికి కమల్ సలహా

Update: 2022-06-03 10:31 GMT
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత విక్రమ్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో కేవలం కమల్ హాసన్ మాత్రమే కాకుండా ప్రముఖ నటులు ఫాహద్ ఫాసిల్ విజయ్ సేతుపతి అలాగే అగ్ర హీరోల్లో ఒకరైన సూర్య కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

స్టార్ క్యాస్ట్ తోనే ఈ సినిమాకు ఒక్కసారిగా అటు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన విక్రమ్ సినిమాకు ఒక విధంగా పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం కూడా కమల్ హాసన్ చేసిన కృషి చాలా ఎక్కువ అని చెప్పాలి. ఈసారి కమల్హాసన్ ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

రీసెంట్ గా యువ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం పాజిటివ్ హైప్ క్రియేట్ చేసింది. అయితే వెంకీ తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవి తో చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇక మిమ్మల్ని ఒక ఫ్యాన్ గా అభిమానించిన లోకేష్ విక్రమ్ సినిమాలో ఎలాగైతే హైలెట్ చేశాడో ఇప్పుడు తాను కూడా మెగాస్టార్ అభిమానిగా అలాగే చూపించడానికి ప్రయత్నం చేస్తానని ఆ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ కు వివరణ ఇచ్చాడు. ఇ

దీంతో ఆ దర్శకుడికి కమల్ హాసన్ తన సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఒక హీరోకు కేవలం అభిమాని అయితే సరిపోదని ఆయన సినిమా కెరీర్ లోని అద్భుతమైన ఫిల్మోగ్రఫీ కూడా  లెక్కలోకి తీసుకోవాలని అన్నారు.

అంతేకాకుండా అప్పట్లో బాలచందర్, కె రాఘవేంద్రరావు ఎలాగైతే విభిన్నంగా చూపించారో అంతకంటే మనం ఇంకా కొత్తగా ఎలా ప్రజెంట్ చేయగలము అనే విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉండాలి అని వెంకీ కుడుముల కు కమల్ హాసన్ తన దైన శైలిలో ఒక వివరణ ఇచ్చారు. మరి యువ దర్శకుడు వెంకీ.. మెగాస్టార్ చిరంజీవి ని ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News