విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈరోజు వినాయక చవితి పర్వదినం సందర్భంగా 'వెంకీమామ' టీమ్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
పండగ సందర్భానికి తగ్గట్టే ఈ పోస్టర్ కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంది. వెంకీ.. చైతు ఇద్దరూ అచ్చమైన తెలుగింటి సంప్రదాయంలో పంచెకట్టులో మెడలో కండువా వేసుకొని కనిపించారు. కాళ్ళకు తోలు చెప్పులు.. కళ్ళకు చలువ కళ్ళజోడు ధరించి ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని చలాకీగా నవ్వుతూ నడిచి వస్తున్నారు. నేపథ్యంలో సంత ఉండడంతో పోస్టర్ మొత్తం పండగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటేనే దగ్గుబాటి మామ అక్కినేని అల్లుడు కలిసి బాక్స్ ఆఫీసును షేక్ చేయడానికి వస్తున్నట్టుగా ఉంది.
ఈ సినిమాలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. చైతుకు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ప్రకాష్ రాజ్.. సంపత్ రాజ్.. పోసాని కృష్ణ మురళి..రావు రమేష్.. బ్రహ్మాజీ.. శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.