నాలుగైదు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజైతే రెవెన్యూ షేరింగ్ అన్న యాస్పెక్ట్ పెద్ద సమస్య. అదొక్కటే కాదు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా రేసులో వెనకబడుతుంది. బాలేదు అన్న టాక్ వస్తే ఆడియెన్ బావున్న సినిమానే ప్రిఫర్ చేస్తారు. ఆ ప్రభావం బాక్సాఫీస్ పై దారుణంగా ఉంటుంది. సెలవు దినాలు అయినా అప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. హిట్టు అన్న పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నా ఓపెనింగ్ కలెక్షన్ల స్థాయి పడిపోతుంది. పైగా నెలరోజుల్లోనే డిజిటల్ రిలీజ్ ఒప్పందాలు ఉన్నందున ఆ ప్రభావంతో జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గింది కాబట్టి ప్రస్తుతం మన మేకర్స్ అంతా రిలీజ్ తేదీని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇదే డైలమా సురేష్ కాంపౌండ్ లో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ - నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న వెంకీమామ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించాలన్నది తొలిగా ప్లాన్. కానీ అది ఇప్పుడు మారిందని తెలుస్తోంది. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు-అల వైకుంఠపురములో- దర్బార్ లాంటి భారీ చిత్రాలు రిలీజవుతున్నాయి. వీటికి మార్కెట్లో బజ్ కూడా ఉంది. అందువల్ల పోటీ కెళితే నష్టపోవడమేనన్న భయాందోళన సురేష్ బాబులో వ్యక్తమైందట.
అయితే ఫలానా తేదీకి ఫిక్సయిపోయాం అని మాత్రం ఆ కాంపౌండ్ చెప్పలేదు. అయితే డిసెంబర్ 12 లేదా 13 తేదీల్ని లాక్ చేయాలని పీపుల్స్ మీడియాతో కలిసి బాబు మంతనాలు సాగించారట. ఆ మేరకు పీపుల్స్ మీడియా సన్నిహిత వర్గాలు లీక్ అందించాయి. ఇదే నిజమైతే ఆ ప్రకారం పంపిణీ వర్గాలకు కొంత హ్యాపీ అనే చెప్పొచ్చు. పోటీలో వెళ్లి ఇబ్బందిపడే కంటే జాగ్రత్తగా వెళితేనే బెటర్ అన్న వాదనా వినిపిస్తోంది. డిసెంబర్ లోనూ క్రిస్మస్ కానుకగా పలు భారీ చిత్రాలు వస్తున్నాయి. డిసెంబర్ 20న నందమూరి బాలకృష్ణ రూలర్.. సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే చిత్రాలు రిలీజ్ కానున్నాయి. డిసెంబర్ 25న రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే విడుదల కానుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవు సహా జనవరి 1 సెలవు.. మొదటి వారంలో రెండు రోజులు పబ్లిక్ హాలిడేస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్ లు చేస్తున్నారు. అయితే వీటికంటే ముందే వెంకీమామ రిలీజ్ ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న టాక్ వస్తే క్రిస్మస్ సెలవుల వరకూ వెంకీ మామను ఆడించేయొచ్చన్న ప్లాన్ కూడా సురేష్ బాబులో ఉందేమో!