`వెన్నెల` కిషోర్ పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా..కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమై గుర్తింపు దక్కించుకున్నారు. ఎంత మంది కమెడీయన్స్ ఉన్నా...ఇంకెంత మంది హాస్య నటులు వచ్చినా...ఆయనకు ఆయనే పోటీ. ఆయనకు ఎవరు సాటి అన్న చందంగా కిషోర్ కేరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది.
స్టార్ హీరో సినిమాల్లో కచ్చితంగా కిషోర్ కి పాత్ర ఉండాల్సిందే అన్న తీరున ఆయన హవా నడుస్తోంది. కిషోర్ కామెడీ టైమింగ్..పెర్పార్మెన్స్ లో ఈజ్ ఎవరూ మ్యాచ్ చేయలేరు. దాదాపు రెండు దశాబ్ధులుగా కిషోర్ టాలీవుడ్ ప్రయాణం కొనసాగుతోంది. `వెన్నల` తో మొదలైన ప్రస్థానం `సర్కారు వారి పాట` వరకూ ఎన్నో తనదైన శైలి నటనతో మెప్పించుకుంటూ వచ్చారు.
కిషోర్ అమెరికా నుంచి ఇండియాకొచ్చి నటుడయ్యారు. అయితే కిషోర్ సినిమా ప్రయాణం వెనుక చాలా పెద్ద కథే ఉందని తెలుస్తోంది. కిషోర్ చిన్న నాటి నుంచి అల్లరిగా ఉండేవాడుట. లైఫ్ పై ఏ మాత్రం క్లారీటీ లేకుండా ఉండేవాడుట. పది పూర్తయి ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియని సందిగ్దం అట.
ఎంపీసీ తీసుకుంటే చదవడం కష్టం. అందులో లెక్కలు ఇంకా కష్టం. అటుపై ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కి వెళ్లడం అంటే భయపడ్డాడుట. ఈ క్రమంలో బైపీసీ గ్రూప్ తీసుకున్నాడుట. అలాగని డాక్టర్ చదివేంత తెలివితేటులు లేవు. నెమ్మదిగా ఇంటర్మీడియ్ పూర్తిచేయగానే చదువంటే బోర్ కొట్టి....రిలాక్స్ అవ్వాలని సైన్స్ గ్రూప్ కి వెళ్లకుండా బీకాంని చాయిస్ గా తీసుకుని డిగ్రీ పూర్తి చేసారుట.
అయితే ఇదే సమయంలో కిషోర్ అక్క పిల్లల్ని మావయ్యతో తిరగొద్దని చెడిపోతారని అనేవారుట. ఆమెకి ఎర్లీ మ్యారేజ్ కావడంతో పిల్లలు కిషోర్ సమానులుగా ఉండటంతోనే అక్క అనేవారని ఓ ఇంటర్వ్యూలో కిషోర్ తెలిపారు. డిగ్రీ తర్వాత న్యూజిలాండ్..ఆస్ర్టేలియా.. అమెరికా వెళ్లాలనుకున్నారుట. కానీ అదంత వీజీ కాదు. అలాగని దుబాయ్ లాంటి దేశం వెళ్లడం ఇష్టం లేదుట.
చివరకు ఎలాగూ ఆస్ర్టేలియా వెళ్లాగలిగారుట. అక్కడే జావా కోర్స్ చేయడం..సాప్ట్ వేర్ ఉద్యోగం వైపు రావడం..అక్కడ నుంచి అమెరికాకి రావడం జరిగాయని తెలిపారు. అటుపై చిన్న నాటి నుంచి ఉన్న సినిమా ఫ్యాషన్ వైపు అడుగులు వేసినట్లు తెలిపారు. ఇక కిషోర్ ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తున్నారు. `ఒకే ఒక్క జీవితం`..`భోళా శంకర్`.. `ఇండియన్-2`..`మిస్టర్ కింగ్` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.