బాహుబలి జోరు తగ్గిపోవడంతో వారానికి రెండు చొప్పున సినిమాలు థియేటర్లలోకి దిగేస్తున్నాయి. గత వారాంతంలో అంధగాడు.. ఫ్యాషన్ డిజైన్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ ఆ రెండు కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ శుక్రవారం కూడా ఒకటికి రెండు సినిమాలు రిలీజవుతున్నాయి. ఐతే ఆ రెండు సినిమాల మీద అంచనాలు అంతంతమాత్రమే. గోపీచంద్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ మీద జనాల్లో ఆసక్తి పెద్దగా లేదు. దీంతో పోలిస్తే ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా ‘అమీతుమీ’ మీద ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. టీజర్.. ట్రైలర్ చూస్తే కచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తిని రేకెత్తించేలా లేవు కానీ.. టైంపాస్ కామెడీ కోసమైతే ఓకే అన్నట్లుగా ఉన్నాయి.
ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకర్షించేది మాత్రం వెన్నెల కిషోరే అని చెప్పాలి. ప్రోమోల్లో అతనే హైలైట్ అవుతున్నాడు. అతడి కామెడీ గిలిగిలింతలు పెడుతుందేమో అనిపిస్తోంది. ఈ మధ్య ఎక్కడికి పోతావు చిన్నవాడా.. కేశవ.. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాలతో కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. ఆ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తనదైన హావభావాలతో.. డైలాగ్ డెలివరీతో.. బాడీ లాంగ్వేజ్ తో.. బోర్ కొట్టించని కామెడీతో నవ్విస్తూ సాగిపోతున్నాడు కిషోర్. ‘అమీ తుమీ’లో అతడిది హీరోలతో సమానమైన క్యారెక్టర్ లాగాకనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే హీరోలు అడివి శేష్.. అవసరాల శ్రీనివాస్ లను కూడా కిషోర్ డామినేట్ చేసేలా కనిపిస్తున్నాడు.
‘అమీ తుమీ’లో కిషోర్ క్యారెక్టర్ పేరు ‘శ్రీ చిలిపి’ కావడం విశేషం. ఈ పేరు చూస్తేనే నవ్వొస్తోంది. టీజర్.. ట్రైలర్లలో కిషోర్ పాత్ర చూస్తే అతడి క్యారెక్టర్ తో బాగానే కామెడీ పండించినట్లు అనిపిస్తోంది. కిషోర్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్.. ఈ మధ్య అతడి కామెడీ విషయంలో జనాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి.. ‘అమీతుమీ’ ప్రోమోల్లో కిషోర్ ను బాగా హైలైట్ కూడా చేస్తోంది చిత్ర యూనిట్. మరి కిషోర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల్ని ఏమేరకు థియేటర్లకు ఆహ్వానిస్తాడో.. వాళ్లను ఎంతమాత్రం ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/