తమిళ దర్శకుడు వీఐ ఆనంద్ తెలుగులో తీసిన తొలి సినిమా ‘టైగర్’ యావరేజ్ అనిపించుకుంది. రెండో సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మాత్రం చాలా పెద్ద హిట్టయింది. ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయిన అల్లు అరవింద్.. తన చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా ఆనంద్‌తో సినిమా తీయించాడు. అదే.. ఒక్క క్షణం. టీజర్.. ట్రైలర్లతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత ఆనంద్ ఎవరితో చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అల్లు అర్జున్ హీరోగా ఆనంద్ సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగింది.
ఐతే హీరో సంగతి చెప్పలేదు కానీ.. తాను అల్లు అరవింద్ నిర్మాతగా సినిమా చేయబోతున్నట్లు మాత్రం స్పష్టం చేశాడు ఆనంద్. శిరీష్ తో చేసిన ‘ఒక్క క్షణం’ కథ కూడా అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పట్టాలెక్కిందని ఆనంద్ వెల్లడించాడు. తనకు సైన్స్ ఫిక్షన్ జానర్ అంటే చాలా ఇష్టమని.. తన తర్వాతి సినిమా కూడా అదే జానర్లో ఉంటుందని.. హీరో ఎవరో ఇంకా ఏమీ తేలలేదని.. ఐతే ‘గీతా ఆర్ట్స్’లో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన మాట మాత్రం వాస్తవమని ఆనంద్ చెప్పాడు. తాను స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగు ఇండస్ట్రీతోనే బాగా అనుబంధం ఉందని.. తాను ఇక్కడే సెటిలై తెలుగులోనే సినిమాలు చేస్తానని ఆనంద్ స్పష్టం చేశాడు. ‘టైగర్’ కంటే ముందు ఆనంద్ తమిళంలో ‘అప్పూచ్చి గ్రామం’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చేశాడు. అది కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలందుకుంది.