బీకామ్ అంటున్న బడా సంస్థ?

Update: 2019-09-10 05:30 GMT
ఈ మధ్య సౌత్ సినిమా పరిధి విస్తృతంగా పెరగడంతో బాలీవుడ్ బడా సంస్థలు తెలుగు తమిళ సినిమాల నిర్మాణంపై పెద్ద కన్నే వేస్తున్నాయి. స్టార్ హీరోలతో లేదా వాళ్ళ బ్యానర్లతో టై అప్ పెట్టుకుని వరస ప్రాజెక్టులు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అయితే వీటికి ఇక్కడ స్థానిక పరిస్థితులు ఆడియన్స్ ప్రాధాన్యతల గురించి పెద్దగా అవహగాన ఉండదు కాబట్టి అధిక శాతం సందర్భాల్లో కేవలం ఇన్వెస్ట్ మెంట్ లెక్కలకే పరిమితమవుతాయి. కొన్ని దెబ్బలు తిన్నా రిస్క్ తీసుకుని ముందుకు వెళ్తాయి. కొన్ని మాత్రం వెనుకడుగు వేస్తాయి.

ట్రేడ్ టాక్ ప్రకారం హిందీలో గత 11 ఏళ్ళుగా ఎన్నో బ్లాక్ బస్టర్లతో గట్టి ఇమేజ్ ఏర్పర్చుకున్న వయాకామ్ 18 పైన చెప్పినవాటిలో రెండో దారిలో ఉన్నట్టు సమాచారం. ఈ సంస్థ ఇటీవలే తెలుగులో మన్మథుడు 2తో ప్రొడక్షన్ దిశగా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున లాంటి సీనియర్ హీరో రకుల్ లాంటి గుర్తింపు ఉన్న హీరోయిన్ రాహుల్ రవీంద్రన్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఇంకేం చాలు అనుకుంది.

కానీ అది అనూహ్య రీతిలో ఊహించని విధంగా దారుణంగా బోల్తా కొట్టడమే కాక నష్టాలు కూడా చూపడంతో వయాకామ్ 18 ఇప్పటికిప్పుడు వెంటనే ఇక్కడ కొత్త సినిమాలు మొదలుపెట్టే ఆలోచనను తాత్కాలికంగా ఆపేసినట్టుగా సమాచారం. గతంలోనూ రిలయన్స్ - పివిపి లాంటి సంస్థలకు ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పటికి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాయి. మరి వయాకామ్ కు అలాంటి ఉద్దేశం ఉందో లేదో కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తరహాలో ఇలా మొదటి సినిమానే చేదు ఫలితాన్ని ఇవ్వడంతో ప్లాన్స్ మార్చుకోవాల్సి వచ్చిందని ఫిలిం నగర్ టాక్


Tags:    

Similar News