వీడియో: Gen-Z ఫ్యాషన్ ఐకాన్ సుహానా ఖాన్

Update: 2023-01-20 05:04 GMT
ఆర‌డుగుల బుల్లెట్టులా.. నిలువెత్తు కింగ్ ఖాన్ న‌డిచొచ్చిన‌ట్టుగా ఎవ‌రీ అందాల సుంద‌రి? అంటారా..! ఇంతందాన్ని బ్రౌనీ (గోధుమ వ‌ర్ణం అమ్మాయి) అని అవ‌మానించిందెవ‌రు? అన్నిటికీ స‌మాధానం త‌న వ‌ద్ద‌ ఉంది! ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!! జోయా అక్త‌ర్ 'ది ఆర్చీస్' తో ఒక  స్టార్ గా త‌న‌ని తాను నిరూపించుకునేందుకు సిద్ధ‌మైన కింగ్ ఖాన్ వార‌సురాలు సుహానా ఖాన్ ఇటీవ‌లే త‌న ద‌ర్శ‌కురాలు జోయాతో వ‌న్ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ (సెట్ లో) ని కూడా జ‌రుపుకుంది. ఏడాది కాలంగా ఈ మూవీ తెర‌కెక్కుతూనే ఉంది. ఇప్ప‌టికి పూర్త‌యి నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉంది.

ఇక షూటింగుల కోసం అటూ ఇటూ విమానాశ్ర‌యాల‌లో ఆద‌రాబాద‌రాగా ప్ర‌యాణించిన సుహానా ఖాన్ తాజా ఎయిర్ పోర్ట్ లుక్ గుబులు పుట్టించింది. సుహానా ఈ లుక్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తోంది.  సుహానా ఖాన్ క్రాప్ టాప్ - కార్గో ప్యాంట్ ధ‌రించి ఎయిర్ పోర్ట్ లో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ ల గారాల‌ కుమార్తె గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే ఫోటోగ్రాఫ‌ర్లు వెంట‌ప‌డి క్లిక్ మ‌నిపించారు.  ప్ర‌స్తుతం ఈ స్నిప్పెట్ లు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారుతున్నాయి. సుహానా త‌న రూపానికి త‌గ్గ‌ట్టు  సౌకర్యవంతమైన క్రాప్ టాప్ ని ఎంచుకుంది. నేటిత‌రం యువ‌రాణిలా జెట్-సెట్ ఫ్యాషన్ తో అబ్బుర‌ప‌రిచింది.

ఎయిర్ పోర్ట్ లుక్ లో సుహానా పూర్తి కంఫర్ట్ గా క‌నిపించింది. అదే స‌మ‌యంలో అలా న‌డిచొస్తూ నాభి అందాల‌ను ఎలివేట్ చేసిన తీరు గ‌మ్మ‌త్తుగా ఉంది. Gen-Z ఫ్యాషన్ ఐకాన్ సుహానా అంటూ ఈ ఫోటోలు వీడియోలు వీక్షించిన‌ అభిమానులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌వుతున్నారు. సుహానా లుక్ ఆహార్యం అచ్చం కింగ్ ఖాన్ ని పోలి ఉండ‌డంతో తాను కూడా అదే రేంజులో ప‌రిశ్ర‌మ‌ను ఏల్తుంద‌ని అంతా భావిస్తున్నారు. సుహానా కొత్త లుక్ లో గుండ్రని నెక్ లైన్ .. ఫుల్-లెంగ్త్ స్లీవ్స్ బాడీకాన్ ఫిట్టింగ్ .. ఓపెన్ గా ఉన్న‌ మిడ్ రిఫ్.. ప్ర‌తిదీ ఎంతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. సుదూర విమానాల కోసం సుహానా ఇలాంటి డ్రెస్ ల‌ను ఎంపిక చేసుకోవడం చెప్పుకోదగ్గ‌ది.

ది ఆర్చీస్ స్ట్రీమింగ్ కోసం ఉత్కంఠ‌

నెట్ ఫ్లిక్స్ ఇండియా ఇటీవ‌ల షేర్ చేసిన 'ది ఆర్చీస్' తారాగణం జాలీ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. టాకీ పూర్త‌యిన అనంత‌రం యువ నటీనటులతో జోయా కేక్ కటింగ్  సెల‌బ్రేష‌న్ చేసారు. స్టార్ కిడ్స్ తో పాటు ఈ చిత్రంలో వేదంగ్ రైనా- యువరాజ్ మెండా- మిహిర్ అహుజా- డాట్ కూడా నటిస్తున్నారు.  ద‌ర్శ‌కురాలితో పాటు సుహానా- ఖుషీ క‌పూర్ ఇన్ స్టాగ్రామ్ లో మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.. అంటూ ఎమోషనల్ ఈమోజీని..రెడ్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసారు.

'ది ఆర్చీస్‌'ను ఆర్చీ ఫిల్మ్స్ -గ్రాఫిక్ ఇండియాతో కలిసి జోయా అక్తర్ - రీమా కగ్తీ 'టైగర్ బేబీ ఫిల్మ్స్' బ్యాన‌ర్ లో నిర్మించారు. ఈ చిత్రం 1960ల నాటి కథాంశంతో రూపొందింది. యువత‌రం స్నేహం.. తిరుగుబాటు... తొలి ప్రేమలు.. హార్ట్ బ్రేకింగ్ ట్విస్టులు..విద్రోహం వ‌గైరా అంశాల మేళ‌వింపుతో రూపొందింది. నెట్ ఫ్లిక్స్ లో రానున్న‌ ఈ సిరీస్ లో సుహానా.. ఖుషీ క‌పూర్ పోటీ ప‌డి న‌టించార‌ని టాక్ వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News